కస్టమర్ల బ్యాంకు అకౌంట్స్ నుంచి మోసం చేసి డబ్బులు డ్రా చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)తో నేరుగా పని చేసేందుకు ప్రభుత్వం బ్యాంకులను ప్రోత్సహిస్తోంది. ఇందుకు కారణం పెరుగుతున్న ఆర్థిక మోసాల సమస్యను పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశం.
ఆర్థిక సేవల విభాగం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ఓ లేఖ రాసింది. ఈ నెలాఖరు అంటే జనవరి నాటికి అన్ని బ్యాంకులను నేరుగా I4C బ్యాక్ ఎండ్ సిస్టమ్‌తో అనుసంధానం చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు. I4Cతో API (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) ఇంటిగ్రేషన్‌ను పూర్తి చేయాలని అభ్యర్థించినట్లు లేఖలో పేర్కొంది.

I4C ఇంటిగ్రేషన్ అంటే ఏమిటి?
I4C అనేది ప్రభుత్వ తీసుకున్న యాక్షన్. భారతదేశంలో సైబర్ నేరాలను అరికట్టడమే దీని ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వం i4c.mha.gov.in వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది . ఇక్కడ, సైబర్ నేరానికి సంబంధించిన అవగాహన ఇంకా అన్ని సంబంధిత సమాచారం అప్ డేట్ చేయబడుతుంది.
వాస్తవానికి ప్రస్తుతం సైబర్ మోసగాళ్ళు ప్రజల అకౌంట్స్ ఖాళీ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు KYC పేరుతో లేదా కొన్నిసార్లు అకౌంట్ బ్లాకింగ్ పేరుతో చాల కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ మోసగాళ్లు నకిలీ అకౌంట్స్ తెరిచి క్యాష్ మరో అకౌంట్కి బదిలీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టడంతోపాటు నకిలీ అకౌంట్స్ గుర్తించి బ్లాక్ చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
I4C పథకం అక్టోబర్ 2018లో ప్రారంభించారు. దీనిని జనవరి 2020లో ప్రారంభించనప్పటికీ జూన్ 2020లో, I4C సిఫార్సుపై భారత ప్రభుత్వం 59 చైనీస్ మొబైల్ యాప్‌లను నిషేధించింది.
ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది?
బ్యాంకులు I4Cతో రిజిస్టర్ చేసుకుంటే ఆర్థిక మోసాలను వెంటనే ఆపవచ్చు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఎవరైనా ఒక మోసగాడు ఒక వ్యక్తి అకౌంట్ నుండి డబ్బును విత్‌డ్రా చేసి, దానిని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ బ్యాంకు అకౌంట్స్ నకిలీవి అంటే అవి వేరొకరి పేరు మీద ఉన్నయని అర్ధం. ఈ మోసం గురించి బాధితుడు వెంటనే ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు I4Cలో చేరాయి. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఉంది.
ఫిర్యాదు అందిన వెంటనే, ఈ సిస్టమ్ I4C ఇంటిగ్రేటెడ్ బ్యాంకుల మధ్య వెంటనే పని చేయడం ప్రారంభిస్తుంది. అంటే, ఈ బ్యాంకుల మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది, మొత్తం విత్‌డ్రా చేసిన బ్యాంక్ అకౌంట్ ఇంకా డిపాజిట్ చేసిన బ్యాంక్ అకౌంట్ సమాచారం వెంటనే బ్యాంకులకు పంపబడుతుంది. సమాచారం అందిన వెంటనే, డబ్బు బదిలీ చేసిన అకౌంట్ లావాదేవీలను బ్యాంకు నిలిపివేస్తుంది. ఒకవేళ ఆ అకౌంట్ ఫేక్ అని తేలితే బ్లాక్ చేయబడుతుంది. తర్వాత ఆ మొత్తాన్ని బాధితుడి అకౌంటీకి బదిలీ చేస్తారు.
డబ్బు ఎలా ఆదా అవుతుంది?
ఎవరైనా ఆన్‌లైన్‌లో మోసపోయినట్లయితే, అతను టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్ ఆన్‌లైన్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్. సమాచారం అందిన వెంటనే, I4C వ్యవస్థ చర్యలోకి వస్తుంది అలాగే డబ్బు లావాదేవీని ఆపడానికి ప్రయత్నిస్తుంది. చాలా సందర్భాలలో సరైన టైంకి ఫిర్యాదు కారణంగా బాధితులు డబ్బు తిరిగి పొందారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications