Microsoft Job Cuts: ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్'లో పనిచేయాలని చాలా మంది కలలు కంటుంటరు. కానీ మైక్రోసాఫ్ట్ సంస్థ మాత్రం మరోసారి తొలగింపులు చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మే నెలలో ఈ తొలగింపులు జరగవచ్చు. తొలగింపులకు గల కారణాలు చూస్తే కంపెనీ టీం నిర్మాణాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోందట. దింతో మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగులు తొలగింపుల సమస్యలను ఎదుర్కోనున్నారు.

ఈసారి మిడిల్ మేనేజ్‌మెంట్ (middle level managers) ఉద్యోగాల తగ్గింపు ప్రభావితం కావచ్చని చెబుతున్నారు, అయితే ప్రాజెక్ట్ టీంలలో ఇంజనీర్ల సంఖ్య నాన్-టెక్నికల్ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉండాలని కంపెనీ కోరుకుంటోంది. ఈ విధానం అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ సూచించిన విధానాన్ని పోలి ఉండనుంది.
ఎంత మందిని తొలగించనుందంటే : అయితే మేనేజర్ల సంఖ్యా ఎలా పెంచాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయని ఈ విషయం తెలిసిన వర్గాలు తెలిపినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది. దీని అర్థం ఇప్పుడు ఒక మేనేజర్ ఎక్కువ మంది ఉద్యోగులను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంత మంది ఉద్యోగాలు కోల్పోతారు అనేది ప్రస్తుతం స్పష్టంగా తెలియకపోయినా, టీంలో ఎక్కువ భాగం కోత కావచ్చని నివేదికలో పేర్కొంది.
మరోవైపు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గత ఏడాది డిసెంబర్‌లో వైస్ ప్రెసిడెంట్లు అండ్ మేనేజర్ల సంఖ్యను 10% తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెల్సిందే. ఈ సంవత్సరం మొదట్లో సుమారు 2 వేల ఉద్యోగాల తగ్గింపు తర్వాత కంపెనీలో ఈ మార్పు జరగనుంది. అయితే మైక్రోసాఫ్ట్ తక్కువ పర్ఫార్మెన్స్ కనబర్చిన ఉద్యోగుల తొలగింపు కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఇక మే నెలలో జరగనున్న కోతల్లో కంపెనీ "మేనేజ్ రివార్డ్స్ స్లైడర్" పర్ఫార్మెన్ రివ్యూ సిస్టం ఆధారంగా తక్కువ పర్ఫార్మెన్స్ కనబరిచినవి వారు కూడా ఉండవచ్చు.
అయితే గత ఏడాది చివరి నుండే టెక్ రంగాన్ని ఉద్యోగాల కొత, తొలగింపులు పట్టి పీడిస్తున్నాయి. తొలగింపుల వల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొద్దిరోజుల క్రితం ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగాల కోత ప్రకటిస్తూ వెంటనే ఆఫీస్ క్యాంపస్ నుండి వైదొలగాలని కోరింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా మీడియాలో పెద్ద దుమారమే రేగింది. అంతేకాదు తాజాగా ఒక స్టార్ట్ అప్ కంపెనీ కూడా ఒకేసారి 70 మందిని తొలగించి వారికీ మరొక ఉద్యోగం దొరికే వరకు సహకరించింది ఇంకా ఉద్యోగం దొరకని వారికీ అదనపు వేతనాన్నీ కూడా అందించింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications