ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ, రిపోర్టింగ్ సంస్థగా అమెరికా రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC)లో నమోదు చేయబడింది గ్రేస్కేల్ బిట్ కాయిన్ ట్రస్ట్(GBTC). అంటే ఈ సంస్థ తన ఆర్థిక నివేదికలను SECకి నివేదిస్తుంది. తద్వారా బిట్ కాయిన్‌కు ఇది పారదర్శకతను పెంచుతుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 6.5 లక్షల బిట్ కాయిన్స్ కలిగి ఉంది. మొత్తం బిట్ కాయిన్ సర్క్యులేషన్‌లో ఇది 3 శాతం. ప్రస్తుత వ్యాల్యూ ప్రకారం ఇది 36.6 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం ప్రతి బిట్ కాయిన్ 56,000 డాలర్లకు పైన ఉంది.

అత్యధిక బిట్ కాయిన్స్ కలిగిన సంస్థ
ప్రపంచంలో అత్యధిక బిట్ కాయిన్స్ కలిగిన సంస్థగా సతోషి నాకామోటో ఉంది. గ్రేస్కేల్ బిట్ కాయిన్ ట్రస్ట్ రెండో సంస్థగా పేర్కొంటోంది. ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ కంపెనీ షేర్లు 60 శాతానికి పైగా లాభపడ్డాయి. GBTCకి ఇటీవల డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీంతో స్టాక్స్ అరవై శాతం పెరిగింది.

భారీ డిమాండ్
పెన్షన్ ఫండ్స్, ఎండోమెంట్స్, హెడ్జ్ ఫండ్స్ వంటి సంస్థల డిమాండ్స్ భారీగా పెరగడంతో ఈ ఫండ్ 2020 క్యాలెండర్ ఏడాదిలో 2 బిలియన్ డాలర్ల నుండి 20 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఫండ్ యొక్క రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం సంస్థాగత పెట్టుబడిదారుల సగటు నిబద్ధత 2020 నాలుగో త్రైమాసికంలో 6.8 మిలియన్ డాలర్లకు పెరిగింది.

భారత్‌లో ట్రేడింగ్
భారతీయ పెట్టుబడిదారులకు విదేశీ వాణిజ్య సదుపాయాలను అందించే ట్రేడింగ్ ప్లాట్స్ చాలా ఉన్నాయి. అయితే జీపీటీసీ షేర్లు ఓటీసీలో ట్రేడ్ అవుతాయి కాబట్టి ఇవి షేర్ల ఆఫర్లో భాగం కావు. ప్రస్తుత నిబంధనలు ఓటీసీ (ఓవర్ ది కౌంటర్) మార్కెట్లో జాబితా చేయబడిన సంస్థల షేర్లలో ట్రేడింగ్‌ను నిరోధించాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications