నామినీ లేకపోతే ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు మునిగిపోతాయా? RBI రూల్స్ ఇవే!

చాలా మంది కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంటుందని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేస్తూ ఉంటారు. అయితే, ఎఫ్‌డీ చేసే సమయంలో నామినీ పేరును యాడ్ చేయడం లేదా ఒక విల్లు (Will) రాసి ఉంచడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇవి రెండూ చేయకుండానే డిపాజిట్ దారుడు అకస్మాత్తుగా మరణిస్తే, ఆ డబ్బును వారి కుటుంబ సభ్యులు తిరిగి పొందవచ్చా? బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఆ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ, నామినీ లేనప్పుడు ఆ ప్రాసెస్ చాలా నెమ్మదిగా, ఎక్కువ డాక్యుమెంట్ల ఖర్చుతో , తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే నామినీ లేనప్పుడు, బ్యాంకు అధికారులు మొదట వచ్చిన బంధువుకు డబ్బులు చేతిలో పెట్టలేరు. దానికి కొన్ని కఠినమైన చట్టపరమైన ఆధారాలు అడుగుతారు.

What happens to your fixed deposits if you leave no nominee or will RBI guidelines FD

బ్యాంకులు అడిగే ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవే..

  • డిపాజిట్ దారుని మరణ ధృవీకరణ పత్రం (Death Certificate)
  • బ్యాంకు నిర్దేశించిన క్లెయిమ్ ఫారమ్
  • క్లెయిమ్ చేసే వ్యక్తి గుర్తింపు, చిరునామా ఆధారాలు (KYC డాక్యుమెంట్లు)
  • ఒరిజినల్ ఎఫ్‌డీ రసీదు (FD Receipt)
  • లీగల్ హెయిర్ సర్టిఫికేట్ (Legal Heir Certificate) లేదా కోర్టు ఇచ్చే సక్సెషన్ సర్టిఫికేట్ (Succession Certificate).

ఆర్‌బీఐ (RBI) గైడ్‌లైన్స్ ఏం చెబుతున్నాయి?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. మరణించిన డిపాజిట్ దారుల క్లెయిమ్‌లను పరిష్కరించడానికి బ్యాంకులు సరళమైన, పారదర్శకమైన విధానాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ నామినీ లేకపోతే, చట్టపరమైన వారసులు తమ అర్హతను నిరూపించుకోవడానికి తగిన పత్రాలను చూపించాలి.

వారసులు ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు, సదరు ఎఫ్‌డీ మొత్తం వర్తించే వారసత్వ చట్టాల ప్రకారం పంపిణీ చేయబడుతుంది. ఇలాంటి సందర్భాలలో, మిగిలిన వారసులందరి నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లేదా సమ్మతి పత్రాలను బ్యాంకులు అడుగుతాయి. వారసుల మధ్య ఏవైనా వివాదాలు ఉంటే మాత్రం, కోర్టు నుండి వచ్చే సక్సెషన్ సర్టిఫికేట్ లేదా కోర్టు ఆర్డర్ సమర్పించే వరకు బ్యాంకులు డబ్బును విడుదల చేయవు.

ఒరిజినల్ ఎఫ్‌డీ రసీదు పోతే ఎలా?

చాలా మంది ఒరిజినల్ ఎఫ్‌డీ రసీదు కనిపించకపోతే డబ్బులు రావని కంగారుపడుతుంటారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. దీనికోసం బ్యాంకుకు ఒక లిఖితపూర్వక దరఖాస్తు ఇవ్వాలి. అందులో ఎఫ్‌డీ నంబర్, డిపాజిట్ మొత్తం, తేదీ వంటి వివరాలు (తెలిసినంత వరకు) పేర్కొనాలి. బ్యాంకు రికార్డులను పరిశీలించి, ఒక ఇండెమ్నిటీ బాండ్ (Indemnity Bond) పై సంతకం తీసుకున్న తర్వాత డూప్లికేట్ రసీదు ఇస్తారు లేదా క్లెయిమ్ సెటిల్ చేస్తారు.

సక్సెషన్ సర్టిఫికేట్ కోసం ఎంత ఖర్చవుతుంది?

కోర్టు ద్వారా సక్సెషన్ సర్టిఫికేట్ పొందడానికి అయ్యే ఖర్చు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. కోర్టు ఫీజు సాధారణంగా డిపాజిట్ ఆస్తి విలువలో నిర్దిష్ట శాతంగా లెక్కిస్తారు. దీనితో పాటు లాయర్ ఫీజు, నోటరీ, అఫిడవిట్ ఖర్చులు అదనం. అంతేకాకుండా, కోర్టు ప్రక్రియ ముగిసి సర్టిఫికేట్ చేతికి రావడానికి వారాల నుండి నెలల సమయం పట్టవచ్చు.

అందుకే, భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యులకు ఇలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే, మీ ప్రతి ఎఫ్‌డీ అకౌంట్‌కు నామినీ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ఎంతో ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+