డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కేసులో ట్రంప్ పరిపాలన వాదనలకు అనుకూలంగా నడుస్తుందని భావించినప్పటికీ, ఆయన నియమించిన న్యాయమూర్తులు కూడా కఠిన ప్రశ్నలతో ప్రభుత్వ న్యాయవాదులను నిలదీశారు. దీంతో ఈ కేసు ఫలితం అనిశ్చితంగా మారింది.
ట్రంప్ 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA) ఆధారంగా అనేక దేశాలపై సుంకాలను విధించారు. ఆయన వాదన ప్రకారం.. అమెరికా అత్యవసర ఆర్థిక పరిస్థితి లో ఉందని, అందుకే వాణిజ్య నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అయితే అనేక దిగువ కోర్టులు ఈ నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేసి నిలిపివేశాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు అదే అంశంపై తుది తీర్పు ఇవ్వబోతోంది.

ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓడిపోతే.. అమెరికా ఇప్పటికే సుంకాల రూపంలో సేకరించిన 72 బిలియన్ డాలర్ల (రూ. 6.38 లక్షల కోట్లు) మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. విచారణ ఆలస్యం అయితే ఈ మొత్తం 750 బిలియన్ డాలర్ల నుండి 1 ట్రిలియన్ డాలర్ల (రూ. 66 నుండి 88 లక్షల కోట్లు) వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ రీఫండ్‌లతో LG, Samsung, Electrolux, Best Buy వంటి దిగుమతి, రిటైల్ దిగ్గజాలు భారీ లాభాలు పొందవచ్చు. వినియోగదారులకూ కూడా నేరుగా ప్రయోజనం కలుగుతుంది, ఎందుకంటే అధిక ధరలు చెల్లించిన వారు కంపెనీలపై క్లాస్ యాక్షన్ కేసులు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది దిగుమతిదారులు తమ సంభావ్య రీఫండ్ హక్కులను కొనుగోలు చేసేందుకు పందేలు కడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
సుప్రీంకోర్టులో ఓటమి ఎదురైనా, ట్రంప్ పరిపాలన సుంకాల విధానాన్ని కొనసాగించే ఇతర చట్టపరమైన మార్గాలను అన్వేషించవచ్చు.
1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం, అమెరికాకు వ్యతిరేకంగా వివక్ష చూపే దేశాలపై సుంకాలను విధించవచ్చు.
అలాగే సెక్షన్ 122 ప్రకారం, వాణిజ్య అసమతుల్యతను సరిచేయడానికి 15 శాతంసుంకాన్ని 150 రోజులపాటు విధించవచ్చు.
1930 టారిఫ్ చట్టంలోని సెక్షన్ 338 అమెరికా పరిశ్రమలకు హానికరమైన దేశాలపై 50 శాతం వరకు సుంకాన్ని అనుమతిస్తుంది.
ట్రంప్ పరిపాలన ఈ చట్టాలను ఉపయోగించే అవకాశముందని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు. ఆయన మాటల్లో మేము వెనక్కి తగ్గము. మాకు ఎన్నో ఎంపికలు ఉన్నాయని చెబుతున్నారు.సుప్రీంకోర్టు ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే.. అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా వాణిజ్య రంగానికి, ఒక భారీ దెబ్బ అవుతుంది. అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి సుంకాల ద్వారా వసూలైన ఇంత పెద్ద మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సమయంలో, ట్రంప్ అధ్యక్ష పదవిపై కూడా ఈ తీర్పు రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ట్రంప్ తనవంతుగా అమెరికా సుంకాలను ఎత్తివేస్తే మూడవ ప్రపంచ దేశంగా మారుతుందని హెచ్చరించారు. అయితే న్యాయనిపుణుల మాటల్లో, ఈ కేసు ఫలితం అమెరికా వాణిజ్య చట్టాల భవిష్యత్తు రూపును నిర్ణయించనుంది. సుప్రీంకోర్టు తీర్పు 2025 చివరి లేదా 2026 మధ్యలో వెలువడే అవకాశం ఉంది. తీర్పు వచ్చే వరకు దిగుమతిదారులు, కంపెనీలు తమ సుంకాల రికార్డులను సురక్షితంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏదేమైనా.. ట్రంప్ ఈ కేసులో ఓడిపోతే అది కేవలం ఒక న్యాయ పరాజయం మాత్రమే కాదు..అమెరికా ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య విధానం, ప్రపంచ మార్కెట్లపై దూరప్రభావాలు చూపే చారిత్రక సంఘటనగా నిలుస్తుంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications