Wipro News: భారీగా నష్టపోతున్న విప్రో స్టాక్.. టెక్ దిగ్గజానికి అసలు ఏమైంది..??
Wipro Shares: ఐటి దిగ్గజం విప్రో 2021లో ఎథిస్పియర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా వరుసగా 10 ఏడాది ప్రపంచంలోని అత్యంత నైతిక సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు పరిస్థితులు కంపెనీలో వేగంగా ప్రతికూలంగా మారుతున్నాయి. ఉన్నతస్థాయి నిష్క్రమణలు పెరగటంతో అందరి దృష్టి ఐటి దిగ్గజంపై ఉంది.
ఒక్కసారి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. విప్రోలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాలో ఉన్న జతిన్ దలాల్ (సెప్టెంబర్ 21, 2023న) తన రాజీనామాను ప్రకటించారు. కంపెనీ ఇండియా హెడ్ సత్య ఈశ్వరన్, చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ సంజీవ్ సింగ్, iDEAS బిజినెస్ హెడ్ రాజన్ కోహ్లీ, VP గుర్విందర్ సాహ్ని, CFO కామినీ షా, CFO నితిన్ V జగన్మోహన్, హెల్త్‌కేర్ అండ్ మెడికల్ డివైజ్‌ల యూనిట్ హెడ్ మహ్మద్ హక్ దిగ్గజ కంపెనీని వీడారు. దాదాపు 20 ఏళ్లకు పైగా కంపెనీలో పనిచేస్తున్న వారు సైతం రాజీనామా చేయటం అందరిలోనూ ఆందోళనలను కలిగిస్తోంది.

విప్రోలో హై-ప్రొఫైల్ ఉద్యోగుల రాజీనామాలను స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు, ఇతర స్టేక్ హోల్డర్లు నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నేడు స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.415 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో బీఎస్ఈలో ధర రూ.417.65 వద్ద కొనసాగుతోంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ.443.60, 52 వారాల కనిష్ట ధర రూ.351.85గా ఉంది. సెప్టెంబర్ 25, 2023 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,18,608.56 కోట్లుగా కొనసాగుతోంది.
కంపెనీ ఆర్థిక పనితీరును గమనిస్తే.. జూలైతో ముగిసిన త్రైమాసికంలో లాభం రూ.2,870.10 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో ఆదాయాలను పరిశీలిస్తే.. 6.1 శాతం వృద్ధితో రూ.22,831 కోట్లుగా ప్రకటించింది. ఐటి దిగ్గజం ప్రస్తుతం మార్జిన్‌ల కోసం ప్రత్యేకించి ఎలివేటెడ్ ఆన్‌సైట్ ఖర్చులు, సప్లై సైడ్ ఒత్తిళ్లతో టెయిల్‌విండ్‌లను చూడలేమని యాక్సిస్ సెక్యూరిటీల్ అంచనా వేస్తోంది. అయితే రానున్న త్రైమాసిక ఫలితాలు చాలా కీలకంగా మారనున్నాయని తెలిపింది.
ఇలాంటి తరుణంలో సురేష్ సేనాపతి జతిన్ దలాల్ ఇటీవలి నిష్క్రమణపై తన అసంతృప్తిని వ్యక్తం చేసినందున, విప్రో తన ప్రతిభను నిలుపుకోవడానికి మరింత కృషి చేయాలని విప్రో మాజీ బోర్డు సభ్యుడు కోరారు. ఇది కంపెనీలో ఏం జరుగుతోందనే ఆందోళనలను రేకెత్తిస్తోంది. వరుస రాజీనామాలను ఆపేందుకు కంపెనీ కృషి చేయాలని స్టేక్ హోల్డర్లు కోరుతున్నారు. ఇది కొనసాగితే ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications