personal loan: పర్సనల్ లోన్ తీసుకోవడం ఇప్పుడు ప్రతిఒక్కరికి చాలా సాధారణం అయిపోయింది. ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే పర్సనల్ లోన్ తీసుకోవడం బెస్ట్ అని అనుకుంటారు. కానీ గత సంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే, పర్సనల్ లోన్ తీసుకునే వారి సంఖ్య ఇతర రకాల లోన్లు తీసుకునే వారి కంటే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అయితే మీరు త్వరగా లోన్ వస్తుందని పర్సనల్ లోన్ తీసుకోకూడదు. ఎందుకంటే పర్సనల్ లోన్ అత్యధిక వడ్డీ రేట్లు ఉన్న లోన్లు అని గుర్తుంచుకోండి. మీకు ఎలాంటి వేరే మార్గం లేనప్పుడు మాత్రమే పర్సనల్ లోన్ వైపు వెళ్ళాలి. ఇలా చెప్పడానికి కారణం, ఏంటంటే ప్రజలు ఇప్పుడు ప్రతి చిన్న అవసరానికి కూడా పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారు. అయితే లోన్ తీసుకున్నాక ఈ అప్పు కట్టడానికి తరువాత చాలా కష్టమైన పని అవుతుంది. మీరు మీ పర్సనల్ లోన్ తిరిగి చెల్లించలేకపోతే బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో మీకు తెలుసా..?

చట్టపరమైన చర్యలు: బ్యాంకులు పదే పదే హెచ్చరించినప్పటికీ కస్టమర్ లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ చట్టపరమైన చర్యలో కస్టమర్‌పై సివిల్ పిటిషన్ వేయవచ్చు. ఇంకా కోర్టు లోన్ తిరిగి కట్టమని డిఫాల్ట్ చేసిన వ్యక్తిని ఆదేశించవచ్చు. చాల సందర్భాల్లో లోన్ డబ్బు తిరిగి కట్టనందుకు ఇలాంటి వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయించాలని కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఒకోసారి జైలు శిక్ష కూడా విధించవచ్చు. ఒకోసారి లోన్ కట్టకపోతే బ్యాంకులు చక్ర వడ్డీ కూడా విధిస్తాయి. ఈ వడ్డీ రేటు బ్యాంకులను బట్టి మారుతుంటాయి కూడా.
లోన్ రికవరీ ఏజెంట్లతో సమస్యలు: లోన్ ఇచ్చే బ్యాంకులు ఒక వ్యక్తి నుండి లోన్ మొత్తాన్ని తిరిగి పొందలేకాపోతే రికవరీ కోసం లోన్ కలెక్షన్ ఏజెంట్లను నియమించవచ్చు. లోన్ వసూలు చేసే ఏజెన్సీల నుండి వసూలు చేసే ఏజెంట్లు లోన్ కట్టని వారిని వేధించవచ్చు. అంతేకాక ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు లేదా ఆస్తులను స్వాధీనం చేసుకున్న కేసులు కూడా చాలా ఉన్నాయి.
మీరు మీ బ్యాంకు లోన్ తిరిగి చెల్లించలేనప్పుడు మీ CIBIL స్కోరు తీవ్రంగా పడిపోతుంది. ఈ కారణంగా భవిష్యత్తులో ఏదైనా బ్యాంకు నుండి లోన్ తీసుకోవడంలో మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ ఏదైనా బ్యాంకు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కూడా చాలా ఎక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. కాబట్టి, పొరపాటున కూడా మీ లోన్ కట్టడం వెనుకాడకూడదు, ఆలస్యం చేయకూడదు.
More From GoodReturns

Interest rates: రేపే RBI పాలసీ నిర్ణయం! లోన్ EMI పెరుగుతుందా? వడ్డీ రేట్లపై క్లారిటీ ఇదే!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications