ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే జఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. త్వరలో బీసీజీ వైఖరి తేలనుంది. ఆ తర్వాత హైపవర్ కమిటీ నివేదిక రానుంది. అమరావతి సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు ఆధ్వర్యంలోని నిపుణులు కమిటీ ఇచ్చిన నివేదికు పరిశీలించి, సిఫార్సు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. దీంతో పాటు బీసీజీ అందించే నివేదికను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే రాజధాని మార్పు అంశంపై అమరావతిలోని 23వ గ్రామాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. హైపవర్ కమిటీ ఏర్పాటుకు 27వ తేదీన కేబినెట్ ఆమోదం తెలిపిన సమయంలోనే అమరావతి రైతుల అంశంపై కూడా చర్చించింది. భూములు ఇచ్చిన వారి పరిస్థితి ఏమిటంటే...?

రైతుల భూమి పరిస్థితి ఏమిటి?
రాజధాని కోసం రైతులు 33వేలకు పైగా ఎకరాల భూమి ఇచ్చారు. అయితే ఇందులో రైతులు ఇచ్చిన దాని కంటే ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కేబినెట్ భేటీ సందర్భంగా చెప్పారని తెలుస్తోంది. ఈ భూముల్లో 20వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని అంటున్నారు. వాటిని మినహాయించి మిగతా భూములు రైతులకు ఇస్తే సరిపోతుందని పెద్దిరెడ్డి సూచించారు.

ప్రత్యామ్నాయ భూమి లేదా ప్లాట్లు
రాజధానిలో ప్రస్తుతం నిర్మాణాలు జరిగిన ప్రాంతంలోని భూములు మినహాయించి, ఇతర భూములను రైతులు కోరితే వెనక్కి ఇచ్చేయాలని, నిర్మాణాలు చేపట్టిన భూములు రైతులు కూడా కోరితే ప్రత్యామ్నాయ భూమి ఇద్దామని, లేదంటే ఒప్పందం ప్రకారం ప్లాట్లు ఇద్దామని జగన్ సూచించారు. దీనికి సంబంధించి న్యాయపరమైన అంశాలను పరిశీలించాలని అధికారులకు కూడా సూచించారు.

కౌలు భారం తగ్గించుకోవాల్సిందే...
కౌలు భారం తగ్గించుకోవాలంటే భూములు వెనక్కి ఇవ్వాలని కూడా సీఎం కేబినెట్ భేటీ సందర్భంగా అన్నారు. అమరావతి ప్రాంతంలో 20వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటిని వాస్తవ లబ్ధిదారులకు అందించాలని చెప్పారు. కౌలు చెల్లింపు భారం తగ్గించుకోవాలంటే భూములు వెనక్కి ఇచ్చి వేయాలని భావిస్తున్నారట. రాజధాని అంశంపై అమరావతి ప్రాంత రైతులతో సంప్రదింపులు జరపాలని ఇటీవలి కేబినెట్ భేటీ సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి సూచించారట. అయితే దానికి సానుకూలంగా స్పందించలేదని అంటున్నారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్
ఇదిలా ఉండగా, ఏపీలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగుతుందనేది వైసీపీ వాదన. ఈ నేపథ్యంలో 2014 జూన్ - డిసెంబర్ మధ్య సుమారు 4200 ఎకరాలకు పైగా టీడీపీ నేతలు, మరికొందరు భూమిని కొనుగోలు చేశారని చెబుతున్నారు. రాజధాని ప్రకటకు ముందే అక్కడి భూమిని కొందరు కొనుగోలు చేశారని, దీనికి ఇన్ సైడర్ ట్రేడింగ్ కారణమని, దీనిపై న్యాయ నిపుణులు లేదా సీబీఐ లేదా లోకాయుక్త విచారణ కోరనున్నారని తెలుస్తోంది.

కమిటీలో వీరు...
కాగా, జీఎన్ రావు, బీసీజీ కమిటీపై పది మంది మంత్రులు, ఉన్నతస్థాయి అదికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, హోంమంత్రి సుచరిత, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి, పరిపాలన, పట్టణాభఇవృద్ధి శాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శ సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications