Meesho: మీషోకు ఓల్డ్ ఫ్రెండ్ గుడ్‌బై.. అంతలోనే కొత్త ఇన్వెస్టర్ల ఎంట్రీ!
Meesho: భారతీయ ఇ-కామర్స్ ఇండస్ట్రీలో మీషో స్టార్టప్ గా ఎదుగుతోంది. కాంపిటీటివ్ ధరలతో ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తూ దూసుకుపోతోంది. మంచి లాభాల బాటలో ఉన్న ఈ కంపెనీపై ఓ దిగ్గజ ఇన్వెస్టర్ కన్ను పడినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
ఇండియా సహా ఆగ్నేయాసియా దేశాల్లోని స్టార్టప్ లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే సంస్థల్లో వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ ఒకటి. సోషల్ కామర్స్ స్టార్టప్ మీషోలో గణనీయమైన వాటా పొందేందుకు అది ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు మీషోకు ఎప్పటి నుంచో పెట్టుబడి సపోర్ట్ ఇస్తున్న వెంచర్ హైవేతో చర్చలు సైతం జరుపుతున్నట్లు సమాచారం.

సాఫ్ట్‌బ్యాంక్, మెటా, ఎలివేషన్, ప్రోసస్ వంటి ప్రముఖ ఇన్వెస్టర్ల మద్దతుతో.. 2021 ఫండింగ్ రౌండ్‌లో మీషో సుమారు 4.9 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను సాధించింది. మునుపటి వాల్యుయేషన్ తో పోలిస్తే 25 నుంచి 35 శాతం తగ్గింపుతో 3.5 బిలియన్ డాలర్లు వెచ్చించి కంపెనీని చేజిక్కించుకోవాలని వెస్ట్ బ్రిడ్జ్ చూస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఇ-కామర్స్ రంగంలో తన పెట్టుబడిని మరింత విస్తరించాలని భావిస్తోంది.
ప్రారంభ మద్ధతుదారు వెంచర్ హైవే ఈ స్టార్టప్ నుంచి పూర్తిగా వైదొలగేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఇదే సమయంలో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ దాదాపు 2 శాతం వాటా కొనుగోలు చేయాలని ఆలోచిస్తోంది. ఇటీవల మీషో తన ఆర్థిక పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. 2022లో దాని స్థూల వాణిజ్య విలువ (GMV) 4.5 బిలియన్ డాలర్లు కాగా జూలై 2023 నాటికి మంచి లాభాలను నివేదించింది.


Click it and Unblock the Notifications