Adani News: బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీకి ఈ ఏడాది దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బెర్గ్ నివేదికతో మొదలైన ఇబ్బందులు.. ఇప్పటికీ వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అదానీ గ్రూప్ కు బిగ్ షాక్ ఇచ్చింది.
తాజ్‌పూర్ డీప్ సీ పోర్ట్ అభివృద్ధికి త్వరలో టెండర్ ప్రారంభించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే ఇదే ప్రాజెక్టును అదానీ గ్రూప్ అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొనడం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఈ మెగా డీప్ సీ పోర్ట్ ప్రాజెక్ట్ చుట్టూ అనిశ్చితి నెలకొంది.

ఈ ప్రాజెక్ట్ ను అదానీ పోర్ట్స్ మరియు సెజ్ లిమిటెడ్ (APSEZ) అభివృద్ధి చేస్తుందని అక్టోబర్ 2022లో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన రెండు చివరి బిడ్‌లలో అదానీ గ్రూప్ L1 బిడ్డర్ గా నిలిచింంది. అయితే తాజాగా బెంగాల్ లో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (BGBS)లో CM మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇక్కడ 12 "గేమ్ ఛేంజింగ్ అవకాశాలు" ఉన్నాయన్నారు.
'తాజ్‌పూర్‌లోని ప్రతిపాదిత డీప్ సీ పోర్ట్ టెండర్‌కు సిద్ధంగా ఉంది. ఔత్సాహికులు టెండర్‌లో పాల్గొనవచ్చు. ఇది దాదాపు 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షిస్తుంది' అని మమతా తెలిపారు. ఈ సమ్మిట్ లో అదానీ గ్రూపు పాల్గొనకపోవడం కూడా తాజ్ పూర్ పోర్ట్ ప్రాజెక్టులో వారి పాత్రపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తింది.
గతంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ టు అవార్డ్ (LOIA)ను.. అదానీ పోర్ట్స్ CEO కరణ్ అదానీకి బెంగాల్ CM స్వయంగా అప్పగిచారు. ప్రస్తుతం గ్రౌండింగ్ కొనసాగించడానికి అవసరమైన తదుపరి పత్రం లెటర్ ఆఫ్ అవార్డ్ కోసం అదానీ పోర్ట్స్ వేచి చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా టెండర్ లో పాల్గొనాల్సిందిగా పారిశ్రామికవేత్తలను CM ఆహ్వానిచడం చర్చనీయాంశమైంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications