భారతదేశంలో ఐటీ రంగాన్ని నమ్ముకున్న కోట్లాది మందికి టీసీఎస్ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఎక్కువ జీతాలు, కార్పోరేట్ జీవితం గడపవచ్చనే భ్రమలన టీసీఎస్ ఒక్కసారిగా తొలగించింది. టెక్ కార్పోరేట్ ప్రపంచం అంతా ఓ మాయా ద్వీపమని చాటి చెప్పింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తాజాగా ప్రకటించిన ఉద్యోగాల కోత టెక్ రంగంలో రావాలనుకునే వారికి ఒక పెద్ద కరెంట్ షాక్ లాంటిదని చెప్పుకోవచ్చు. TCS తొలగింపులు ప్రస్తుతం భారత ఐటీని కుదిపేస్తున్నాయి. TCS తొలగింపుల ప్రభావంతో విప్రో, ఇన్ఫోసిస్ తో పాటుగా మరో 37 ఐటీ కంపెనీల స్టాక్స్ ఈరోజు పడిపోయాయి
ప్రపంచవ్యాప్తంగా 613,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్న ఐటీ దిగ్గజం టీసీఎస్..మార్చి 2026 నాటికి దాదాపు 12 వేల ఉద్యోగాలను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన టెక్ రంగంలొ ఒక్కసారిగా కలకలం రేపింది. ఇది సంస్థ మొత్తంలో సుమారు 2 శాతంగా ఉంది. ఈ చర్య టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిందని చెప్పవచ్చు.

టీసీఎస్ ప్రకటించిన తాజా తొలగింపులు ప్రధానంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా లెగసీ టెక్నాలజీల్లో పని చేస్తున్నవారు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. అలాగే క్లయింట్‌కు నేరుగా సంబంధం లేని పాత్రల్లో ఉన్నవారు కూడా తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.ఇంకా ప్రాజెక్ట్ మేనేజర్లు కూడా దీని ప్రభావానికి లోనవుతున్నారు. ఇక ఏఐ వాతావరణానికి అందిపుచ్చుకోకపోతే వారికి భవిష్యత్తులో అవకాశాలు మరింత తగ్గినట్లేనని చెప్పవచ్చు.
దూసుకొస్తున్న AI ప్రభావమే ఈ మార్పుల వెనుక ముఖ్యమైన కారణంగా TCS కంపెనీ పేర్కొంది. సంస్థ భవిష్యత్తులో వచ్చే మార్పులకు సిద్ధంగా ఉండేందుకు తన వర్క్‌ఫోర్స్‌లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే బెంచ్ పాలసీ కూడా చాలా కఠిన తరంగా మార్చింది. ఒక ఉద్యోగి ఏడాదిలో 35 రోజులకు మించి ప్రాజెక్టులో లేకున్నా.. తిరిగి కేటాయింపు లేకపోతే అతడిని కంపెనీ నుంచి బయటకు పంపిస్తోంది.
టీసీఎస్ తీసుకున్న తాజా ప్రకటనపై ఉద్యోగుల నుండి పలు రకాల స్పందనలు వచ్చాయి. కోల్‌కతాకు చెందిన అభిషేక్ సుర్ లింక్డ్ఇన్‌లో స్పందిస్తూ.. ఒకప్పుడు TCS అంటే ప్రభుత్వ ఉద్యోగం లాంటిదని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరికీ భద్రత లేదని తేల్చి చెప్పారు.దిగ్గజ సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కావన్నారు.
ఆర్ఠిక సలహాదారు కానన్ బహ్ల్ టీసీఎస్ తొలగింపులపై స్పందిస్తూ..టీసీఎస్ 12 వేల మందిని తొలగించడం అనేది ఓ హెచ్చరిక లాంటిది. 45 ఏళ్ళే అనేది ఇప్పుడు కొత్త 60 ఏళ్ళకు చేరుకుందన్నారు. ఇప్పుడు ఉద్యోగులు చేయాల్సింది.. 12 నెలల అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవడం, వ్యక్తిగత ఆరోగ్య, టర్మ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం, AI వంటి రంగాల్లో నైపుణ్యాలను పెంచుకోవడం అత్యవసరమని నొక్కి చెప్పారు.క్లుప్తంగా చెప్పాలంటే AI రాకతో అది ఎటువంటి ఉద్యోగాలు తీయడం లేదు. AIని సద్వినియోగం చేసేవారు లేదా కంపెనీలు మాత్రమే ఉద్యోగాలు తీస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే విప్రోలో పనితీరు పరీక్షలు, HCLTechలో ఆటోమేషన్ వల్ల ఉద్యోగాల కోత వంటి మార్పులు ఐటీలో కలకలం రేపతుండగా టీసీఎస్ దాన్ని మరింతగా పెంచింది. ఇక ఇంటెల్ కూడా 25 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుందనే వార్తలు కూడా ఐటీ రంగం సంక్షోభం దిశగా పయనిస్తుందనే సంకేతాలను పంపిస్తోంది. CS లేఆఫ్స్ ఈ మార్పు దిశలో ఒక ఆరంభం మాత్రమే.. ముందు ముందు ఐటీ రంగంలో ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాలి.
More From GoodReturns

Layoffs: కోడింగ్ చేసే రోజులు పోయాయా? లేఆఫ్స్ భయాల మధ్య TCS సీఈఓ కీలక వ్యాఖ్యలు!

Layoffs: లేఆఫ్స్ వల్ల పనితీరు ఎందుకు పడిపోతుంది? సైన్స్ చెబుతున్న నిజాలివే..

Layoffs: ఏఐ మీ ఉద్యోగాన్ని లాగేసుకుంటుందా లేక మిమ్మల్ని బాస్‌ను చేస్తుందా?

జోహో ఉద్యోగుల తొలగింపు: ఆ 300 మందికి ఏం జరిగింది?

TCS ఉద్యోగులకు తీపి కబురు.. ఏప్రిల్ 1 నుంచి జీతాల పెంపు! ఏ గ్రేడ్ వారికి ఎంతంటే?

Stock Market: సెన్సెక్స్ టాప్ లూజర్స్ ఇవే.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలా, లేక ఇన్వెస్ట్ చేయాలా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications