పడిపోయిన రూపాయి వ్యాల్యూ, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ భారీగా పడిపోయింది. ఏడాది క్రితం 73.21 వద్ద ఉన్న రూపాయి వ్యాల్యూ ఆరు శాతం వరకు పతనమై ఇప్పుడు 77.69 వద్దకు చేరుకుంది. ఏడాది కాలంలో రూపాయి భారీగా పతనమైనప్పటికీ, ఇందులో గత ఐదు నెలల్లోనే అధికంగా క్షీణించింది. జనవరి నుండి రూపాయి ఏకంగా 4 శాతం పడిపోయింది. అయితే అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే డాలర్ బలపడి రూపాయి మరింత పడిపోవచ్చుననే ఆందోళనలు ఉన్నాయి. వచ్చే ఏడాదిన్నర కాలంలో డాలర్‌తో రూపాయి 80కి చేరుకోవచ్చునని గతంలోనే అంచనాలు వచ్చాయి.

ఒక డాలర్ వ్యాల్యూ చేసే వస్తువులకు 2017లో రూ.64 చెల్లిస్తే ఇప్పుడు రూ.77.62 చెల్లించవలసి ఉంటుంది. 2017తో పోలిస్తే రూపాయి ప్రతి సంవత్సరం 3.75 శాతం చొప్పున క్షీణిస్తూ వచ్చింది. రూపాయి క్షీణత వల్ల దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు మన జేబుకు కూడా చిల్లు పడుతుంది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల భారీ పెరుగుదల వంటి అంశాలు ప్రభావం చూపాయి.

 Weaker rupee will impact the Indian economy

రూపాయి బలహీనపడటంతో దిగుమతి కోసం చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్స్, ఎల్ఈడీ టీవీలు, డిజిటల్ కెమెరా, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో వాడే సర్క్యూట్ బోర్డులు దిగుమతి చేసుకుంటోంది భారత్. ఈ ఉత్పత్తులపై రూపాయి ప్రభావం ఉంటుంది. దిగుమతి చేసుకునే విలాసవంత కార్లు, బైక్స్‌‍తో పాటు కార్ల విడిభాగాలు కూడా పెరగవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+