ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ తమపై వస్తున్న ఆరోపణలపై ,వ్యాజ్యాలపై వివరణ ఇచ్చింది. అమెరికాకు చెందిన రోసన్ లా కంపెనీ దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ వ్యాజ్యంతో పాటు, తమ బ్యాంకు ఉద్యోగులపై దాఖలైన ఫిర్యాదుపై తమ స్పందన తెలియజేసింది . తమ బ్యాంకుపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. బ్యాంకుపై వేసిన వ్యాజ్యాలపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొంది . బ్యాంకు , నిజాలను చెప్పకుండా తప్పుడు ప్రకటనలతో వాటాదారులకు నష్టం కలిగించిందని చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించింది బ్యాంకు .
హెచ్‌డీఎఫ్‌సీ వాహన-ఫైనాన్సింగ్ విభాగంలో తప్పుడు విధానంపై దర్యాప్తు జరిపినట్లు బ్యాంకు నివేదించిన కొద్ది రోజుల తరువాత ,వాహన రుణాల టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు తప్పుడు విధానాలు అవలంబించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో వ్యాజ్యం దాఖలు అయ్యింది . ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు, వాటాదారులకు రక్షణగా నిలిచే సంస్థ రోసన్ లా హెచ్‌డీఎఫ్‌సీ పై దావా వెయ్యటం సంచలనంగా మారింది.

మరోవైపు న్యూయార్క్ లోని మరో లా సంస్థ పోమెరాంట్జ్ కూడా హెచ్‌డీఎఫ్‌సీ అవుట్‌గోయింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి, సీఈఓగా బాధ్యతలను చేపట్టనున్న శశిధర్ జగదీషన్, కంపెనీ కార్యదర్శి సంతోష్ హల్దంకర్‌పై లా సూట్ ఫైల్ చేశారు.
ప్రైవేటురంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ అమెరికాకు చెందిన న్యాయ సంస్థల వ్యాజ్యాలపై వివరణ ఇచ్చింది. దీనిపై స్పందించిన బ్యాంకు 2021 ప్రారంభంలో తమ స్పందన తెలియజేయాలని భావిస్తున్నట్టు రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం ఇంతకుమించి వివరాలను అందించలేమని పేర్కొంది బ్యాంకు . ఇది ఇలా ఉంటే పొటెన్షియల్ సెక్యూరిటీ క్లెయిమ్స్‌పై షేరు హోల్డర్స్ తరపున విచారణ ప్రారంభించినట్లు రోసన్ లా గత నెలలో తెలిపింది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ న్యాయ పోరాటం చేస్తామని , తాము ఇన్వెస్టర్ లను ఎలాంటి మోసం చెయ్యలేదని స్పష్టం చేస్తుంది .


Click it and Unblock the Notifications