Mutual funds: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఓకే.. మరి విత్‌డ్రాలో రకాలు తెలుసా? ఇవిగో వివరాలు

Mutual funds redemption: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎంచుకుంటున్న అత్యుత్తమ పెట్టుబడి విధానం మ్యూచువల్ ఫండ్స్. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండటంతో దీనివైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. వివిధ రకాల ఫండ్స్‌ ద్వారా సుదీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇన్వెస్ట్‌ చేయడం సరే మరి పెట్టుబడిని ఎలా రిడీమ్ చేసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మ్యూచువల్ ఫండ్స్ రీడీమ్ చేసుకోవడం అనేది సరళమైన ప్రక్రియ. ఇన్వెస్టర్స్ తమ ఆర్థిక అవసరాలు మరియు లక్ష్యాలను బట్టి పెట్టుబడిలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. తదనుగుణంగా యూనిట్లను రిడీమ్ చేసే అవకాశం ఉంటుంది.​ ఈ పద్ధతి పెట్టుబడిదారులకు చాలా అనువైనది. ఎందుకంటే అవసరానికి సరిపడా యూనిట్లను రిడీమ్ చేసి మిగతా మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం కొనసాగించవచ్చు.

Ways for redemption of Mutual Fund units

మ్యూచువల్ ఫండ్ విలువను రీడీమ్ చేయడం వలన పెట్టుబడిదారులు నిర్దిష్ట సంఖ్యలో యూనిట్లకు బదులుగా డబ్బు తీసుకునేందుకు వీలు ఉంది. సంబంధిత యూనిట్లు ప్రస్తుత NAV ఆధారంగా లెక్కించబడతాయి. నిర్ణీత మొత్తం అవసరమయ్యే ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏదైనా కారణాల వల్ల పెట్టుబడిదారుడు ఇకపై పథకాన్ని కొనసాగించకూడదనుకుంటే పూర్తిగా రిడీమ్ చేసుకోవచ్చు.

వీటికి భిన్నంగా నెలవారీ పెన్షన్ తరహాలో నిర్ణీత యూనిట్లను SWP ఉహసంహరించుకోవచ్చు. ఈ విధానం మిగిలిన పెట్టుబడిని అలాగే ఉంచుతూ స్థిరమైన ఆదాయాన్ని ఇన్వెస్టర్స్‌కు అందిస్తుంది. పదవీ విరమణ చేసిన వారికి లేదా ప్రతినెలా ఆదాయం అవసరమైన వారికి ఇది అనువైనది. ద్వితీయ ఆదాయ వనరులను సృష్టించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

పెట్టుబడిదారు ఫండ్ హౌస్ వెబ్‌సైట్‌లో లేదా వారి కార్యాలయంలో రిడెంప్షన్ ఫారమ్/SWP ఫారమ్‌ను పూరించాలి. అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి ఫోలియో నంబర్, బ్యాంక్ వివరాలు, గుర్తింపు రుజువు జతచేయవలసి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ రిడెంప్షన్‌కు సాధారణంగా 3-4 పని దినాల సమయం పడుతుంది. డెట్ ఫండ్స్ అయితే 1-2 పని దినాలు, లిక్విడ్ ఫండ్స్ ఒక పని రోజులోపు ప్రాసెస్ చేయబడతాయి. ఇక SWP కోసం ఎంచుకున్న మొత్తం ముందుగా నిర్వచించిన షెడ్యూల్ ప్రకారం (నెలవారీ, త్రైమాసిక, మొదలైనవి) బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+