Warren Buffett Success Story: అమెరికాలోని ఒమాహాలో చిన్న వయసులో సోడా బాటిళ్లు అమ్మిన ఓ బాలుడు... నేడు ప్రపంచ కార్పోరేట్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నాడు. పేపర్‌బాయ్ నుంచి మొదలైన అతని ప్రస్థానం నేడు ప్రపంచ పెట్టుబడి దిగ్గజాల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆ బాలుడే వారెన్ బఫెట్. ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దిగ్గజ వ్యాపారవేత్త, ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. బెర్క్‌షైర్ హాథ్‌వే ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి ఆయన వీడ్కోలు పలికారు. దీంతో కార్పొరేట్ చరిత్రలో ఒక అసాధారణ నాయకత్వ శకానికి తెరపడినట్లైంది. ప్రస్తుతం 95 ఏళ్ల వయస్సులో ఉన్న బఫెట్, దాదాపు ఆరు దశాబ్దాల పాటు బెర్క్‌షైర్ హాత్‌వేను తన తెలివితేటలతో నడిపించారు.
ఒకప్పుడు సాధారణ టెక్స్‌టైల్ కంపెనీగా ఉన్న సంస్థను, ప్రపంచంలోనే అత్యంత విలువైన, విశ్వసనీయ కార్పొరేట్ దిగ్గజంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.బెర్క్‌షైర్ హాథ్‌వే నుంచి అధికారికంగా తప్పుకోవడం బఫెట్ కెరీర్‌లో ఇదే తొలిసారి. గత 60 ఏళ్లుగా ఆయన ఈ సంస్థలో వేర్వేరు హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. CEO పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, ఛైర్మన్‌గా కొనసాగుతూ సంస్థకు మార్గనిర్దేశం చేస్తానని బఫెట్ ప్రకటించడం పెట్టుబడిదారులకు భరోసానిచ్చే అంశంగా మారింది.

వ్యాపార బీజం బాల్యంలోనే: 1930లో అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం, ఒమాహాలో జన్మించిన వారెన్ బఫెట్ చిన్ననాటి నుంచే డబ్బు విలువను తెలుసుకున్నారు. మహా మాంద్యం (Great Depression) ప్రభావాలు అతని కుటుంబంపై, సమాజంపై చూపిన ప్రభావంతో ఆర్థిక స్థిరత్వంపై అతనిలో ఆసక్తిని పెంచింది. ఆరు ఏళ్ల వయసులోనే తన తాత దుకాణం నుంచి కోకా-కోలా బాటిళ్లు కొనుగోలు చేసి, ఒక్కో బాటిల్‌ను లాభంతో అమ్మడం ద్వారా తన తొలి వ్యాపార ప్రయోగాన్ని చేశాడు.
దాని తర్వాత మ్యాగజైన్‌లు, చూయింగ్ గమ్ ప్యాక్‌లు అమ్మడం, పొరుగువారికి గోల్ఫ్ బంతులు సేకరించి తిరిగి విక్రయించడం వంటి చిన్నచిన్న వ్యాపారాలు చేశాడు. ఇవన్నీ అతనికి సరఫరా-డిమాండ్, ధర నిర్ణయం వంటి ప్రాథమిక వ్యాపార సూత్రాలను నేర్పాయి. ఈ వ్యాపార సూత్రాలే వ్యాపార సామ్రాజ్యంలో అతన్ని తిరుగులేని బిజినెస్ టైకూన్ గా నిలబెట్టాయి.
పేపర్ రూట్ నుంచి పెట్టుబడుల దిశగా: ఉన్నత పాఠశాల చదువుతున్న సమయంలోనే వారెన్ బఫెట్ నెలకు సుమారు 175 డాలర్లు సంపాదించే పేపర్ రూట్ నడిపేవాడు. ఆ రోజుల్లో ఇది ఎంతో పెద్ద మొత్తంగా చెప్పుకోవచ్చు. ఆ డబ్బుతో పొదుపు చేయడం ప్రారంభించి.. ఓ స్నేహితుడితో కలిసి పిన్‌బాల్ మెషిన్ వ్యాపారం మొదలుపెట్టాడు. స్థానిక క్షౌరశాలల్లో యంత్రాలు పెట్టి ఇద్దరూ లాభాలను పంచుకునేవారు. చివరికి ఆ వ్యాపారంలో తన వాటాను 1,200 డాలర్లకు విక్రయించాడు. ఇది అతని యువ జీవితంలో కీలక మైలురాయిగా చెప్పవచ్చు.
తొలి స్టాక్ పెట్టుబడి: వారెన్ బఫెట్ 11 ఏళ్ల వయసులోనే తన తొలి స్టాక్ పెట్టుబడిని చేశాడు. సిటీస్ సర్వీస్ ప్రిఫర్డ్ షేర్లను కొనుగోలు చేసి, ధర పడిపోతే భయపడి.. కొద్దిగా లాభంతో అమ్మేశాడు. తర్వాత అదే స్టాక్ భారీగా పెరగడం చూసి సహనం ఎంత ముఖ్యమో అనే జీవితకాల పాఠాన్ని నేర్చుకున్నాడు. అదే అతని వ్యాపార సామ్రాజ్యాన్ని తరువాత కాలంలో పరుగులు పెట్టించింది.
తండ్రి ప్రభావం: వారెన్ తండ్రి హోవార్డ్ బఫెట్ స్టాక్ బ్రోకర్. ఆ తరువాత కాంగ్రెస్ సభ్యుడు. ఆయన కార్యాలయంలో గడిపిన గంటలు బఫెట్‌కు స్టాక్ మార్కెట్‌పై లోతైన అవగాహనను అందించాయి. తరువాత కొలంబియా బిజినెస్ స్కూల్‌లో చదువుతున్న సమయంలో బెంజమిన్ గ్రాహం శిష్యుడిగా మారాడు. గ్రాహం పరిచయం చేసిన విలువ పెట్టుబడి సిద్ధాంతం బఫెట్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కార్పోరేట్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
బెర్క్‌షైర్ హాత్వే కొనుగోలు: వారెన్ 1965లో కష్టాల్లో ఉన్న టెక్స్‌టైల్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వేను కొనుగోలు చేశాడు. మొదట అది ఒక భావోద్వేగ నిర్ణయమేనని తర్వాత అతనే అంగీకరించాడు. అయితే అదే కంపెనీని బీమా, రైల్వేలు, యుటిలిటీస్, వినియోగదారుల బ్రాండ్లు, ఈక్విటీ పెట్టుబడుల కేంద్రంగా మార్చాడు. 1967లో నేషనల్ ఇండెమ్నిటీ కొనుగోలు ద్వారా బీమా రంగంలోకి ప్రవేశించాడు. GEICO వంటి సంస్థలతో బెర్క్‌షైర్‌కు స్థిరమైన నగదు ప్రవాహం ఏర్పడింది. ఇదే ఇతర పెద్ద పెట్టుబడులకు పునాది రాయి అయ్యింది.
సంక్షోభాల్లో నిలకడ ప్రదర్శన: 1973-74 మాంద్యం, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వంటి సమయంలో కూడా వారెన్ బఫెట్ భయపడలేదు. గోల్డ్‌మన్ సాక్స్, జనరల్ ఎలక్ట్రిక్ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి.. సంక్షోభాన్ని అవకాశంగా మలిచాడు. అదే సమయంలో డాట్‌కామ్ బబుల్ నుంచి దూరంగా ఉండి తన దూరదృష్టిని నిరూపించాడు.
దాతృత్వంలోనూ మేటి: పేపర్ రూట్‌తో మొదలైన ప్రయాణం బఫెట్‌ను 100 బిలియన్ డాలర్లకు పైగా నికర విలువ కలిగిన వ్యక్తిగా మార్చింది. అయినప్పటికీ, తన సంపదలో మెజారిటీ భాగాన్ని దాతృత్వానికి ఇవ్వాలని నిర్ణయించాడు. గివింగ్ ప్లెడ్జ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లకు మార్గదర్శకుడయ్యాడు.
ఒమాహాలో సోడాలు అమ్మిన చిన్న పిల్లవాడి నుంచి, ప్రపంచ పెట్టుబడి చరిత్రలో శాశ్వతంగా నిలిచే నాయకుడిగా మారిన వారెన్ బఫెట్ ప్రయాణం ప్రతి యువ పారిశ్రామికవేత్తకు, పెట్టుబడిదారుకు ప్రేరణగా నిలుస్తోంది. సహనం, క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృష్టి ఉంటే సాధ్యం కానిదేమీ లేదని ఆయన జీవితం ఈ తరానికి స్పష్టంగా చెబుతోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications