నాస్‌డాక్ కంప్యూర్‌లో పట్టనంతంగా బఫెట్ బెర్క్‌షైర్ షేర్ ధర

అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే షేర్ ధర భారీగా ఎగిసిపడింది. ఎంతలా అంటే నాస్‌డాక్ కంప్యూటర్లు చూపించగలిగే గరిష్ట విలువకు అతి దగ్గరగా ఉంది. అంటే ఈ కంపెనీ షేర్ ధర అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో నాస్‌డాక్ కంప్యూటర్ సిస్టంను అప్ గ్రేడ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కంపెనీ క్లాస్ ఏ షేర్ ధర మంగళవారం నాడు 4,21,000 డాలర్లను మించింది. ఇప్పటికే ఈ షేర్ ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. అయితే నాస్‌డాక్‌లో కంప్యూటర్లు చూపించే గలిగే గరిష్ట వ్యాల్యూ 4,294,967,295 డాలర్లు.

మంగళవారం బెర్క్‌షైర్ హాథ్‌వే షేరు ధ‌ర చూపించ‌డాన్ని నాస్‌డాక్ తాత్కాలికంగా నిలిపివేసింది. నాస్‌డాక్ కంప్యూట‌ర్లు లెక్కించే విధానం, అది ఉపయోగించే కాంపాక్ట్ డిజిట‌ల్ ఫార్మాట్ కార‌ణంగా ఈ స‌మ‌స్య తలెత్తినట్లు ది వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ వెల్ల‌డించింది. 32 బిట్స్ ఉప‌యోగించే కాంపాక్ట్ కంప్యూట‌ర్ ఫార్మాట్లో నాస్‌డాక్ స్టాక్ ధ‌ర‌ల్ని రికార్డ్ చేస్తుంది. ఇందులో గ‌రిష్ఠంగా 4,294,967,295. ఇక స్టాక్ ధ‌ర‌లు త‌ర‌చూ నాలుగు డెసిమ‌ల్ స్థానాల వ‌ర‌కు స్టోర్ చేస్తారు. ఆ లెక్క‌న గ‌రిష్ఠ స్టాక్ ధ‌ర 429,496.7295ను మాత్ర‌మే నాస్‌డాక్ కంప్యూట‌ర్ సిస్ట‌ం చూపిస్తుంది.

Warren Buffetts Berkshire Hathaway share price goes so high that it broke Nasdaq

నాస్‌డాక్ మే 17, 2021న అప్ గ్రేడ్ చేయనుందని భావిస్తున్నారు. షేర్ ధర 429,496.7295 డాలర్ల పైకి కూడా చేరుకునే వెసులుబాటు ఉండనుంది. వాల్ స్ట్రీట్ ఇండెక్స్ తన కంప్యూటర్ సిస్టంను అప్ గ్రేడ్ చేసే వరకు నాస్‌డాక్‌లోని బెర్క్ షైర్ హాత్‌వే స్టాక్స్ స్క్రీనింగ్ ఆగిపోతుందని భావిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+