గ్లోబల్ కార్పోరేట్ ఇన్వెస్ట్ మెంట్ రంగంలో చారిత్రాత్మక మలుపు చోటు చేసుకోబోతోంది. ఆరు దశాబ్దాల పాటు బెర్క్‌షైర్ హాత్వే కు సేవలందించిన లెజెండరీ వారెన్ బఫెట్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన తర్వాత బెర్క్‌షైర్ హాత్వే భవిష్యత్ ఎలా ఉండబోతోందనే దానిపై ఆసక్తికర చర్చకు తెరలేచింది. 60 సంవత్సరాలకు పైగా బెర్క్‌షైర్ హాత్వేను నడిపించిన లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ రిటైర్ మెంట్ కార్పోరేట్ ప్రపంచంలో కొత్త సవాళ్లతో కూడిన అంశాలపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
Warren Buffett నుంచి సంస్థ బాధ్యతలను గ్రెగ్ అబెల్ ఈ వారం చివర్లో అధికారికంగా చేపట్టనున్నారు. పెట్టుబడుల ప్రపంచంలో ఒరాకిల్ ఆఫ్ ఒమాహా గా పేరొందిన బఫెట్ నాయకత్వం నుంచి కొత్త యుగంలోకి అడుగుపెడుతున్న బెర్క్‌షైర్ హాత్వే ప్రయాణంపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
1962లో ఒక చిన్న టెక్స్‌టైల్ మిల్లుగా ఉన్న బెర్క్‌షైర్ హాత్వేను కొనుగోలు చేసిన బఫెట్.. కాలక్రమేణా దాన్ని ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్పొరేట్ సామ్రాజ్యాల్లో ఒక దానిగా తీర్చిదిద్దారు. గీకో, నేషనల్ ఇండెమ్నిటీ వంటి బీమా కంపెనీలు.. బీఎన్‌ఎస్‌ఎఫ్ (BNSF) రైల్వే, డెయిరీ క్వీన్ వంటి వినియోగ బ్రాండ్లు, ఎనర్జీ, తయారీ, రిటైల్ రంగాల్లో విస్తృత పెట్టుబడులతో బెర్క్‌షైర్‌ను బహుముఖ సంస్థగా మార్చారు.

యాపిల్, కోకా-కోలా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి కంపెనీల్లో వారెన్ బఫెట్ చేసిన దీర్ఘకాలిక పెట్టుబడులు సంస్థకు అపారమైన సంపదను తీసుకొచ్చాయి. కొనుగోలు చేసి పట్టుకో అనే తత్వంతో.. తాత్కాలిక మార్కెట్ ఊగిసలాటలను పట్టించుకోకుండా బఫెట్ చేసిన పెట్టుబడులు పెట్టుబడిదారులకు స్థిరమైన నమ్మకాన్ని కలిగించాయి. గత 20 ఏళ్లలో 60 బిలియన్ డాలర్లకు పైగా సంపదను దానం చేసినప్పటికీ.. బఫెట్ వ్యక్తిగత సంపద నేటికీ సుమారు 150 బిలియన్ డాలర్లుగా ఉండటం ఆయన పెట్టుబడి నైపుణ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
2018 నుంచి బెర్క్‌షైర్ నాన్-ఇన్సూరెన్స్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న 62 ఏళ్ల గ్రెగ్ అబెల్.. బఫెట్‌కు భిన్నమైన నాయకత్వ శైలితో ముందుకు సాగుతున్నారు. కెనడాకు చెందిన అబెల్, కఠిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఆపరేషనల్ సామర్థ్యాలపై దృష్టి పెట్టే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటీవల నెట్ జెట్స్ సీఈఓ ఆడమ్ జాన్సన్‌ను సంస్థ సర్వీసులు, రిటైల్ విభాగాలకు హెడ్‌గా నియమించడం ద్వారా బెర్క్‌షైర్‌లో మూడో ప్రధాన విభాగాన్ని ఏర్పాటు చేయడం అబెల్ వ్యూహాత్మక ఆలోచనకు ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు.
టాడ్ కాంబ్స్ (గీకో సీఈఓ) నిష్క్రమణ.. సీఎఫ్ఓ మార్క్ హాంబర్గ్ పదవీ విరమణ నేపథ్యంలో అబెల్ పాత్ర ఇప్పుడు మరింత కీలకంగా మారింది. అయినప్పటికీ, బెర్క్‌షైర్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న వికేంద్రీకరణ విధానం అలాగే కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం బెర్క్‌షైర్ వద్ద 382 బిలియన్ డాలర్లకు పైగా నగదు నిల్వలు ఉన్నాయి. ఈ భారీ మొత్తాన్ని సమర్థవంతంగా పెట్టుబడి పెట్టడానికి సరైన అవకాశాలు లభించకపోవడమే అబెల్ ముందున్న అతిపెద్ద సవాల్. పెద్ద కొనుగోళ్లు సాధ్యపడకపోతే, చరిత్రలో ఎన్నడూ లేనంతగా డివిడెండ్లు చెల్లించాలని లేదా స్టాక్ బైబ్యాక్ చేయాలనే ఒత్తిడి వాటాదారుల నుంచి రావచ్చు. అయితే.. బఫెట్ వద్ద ఉన్న సుమారు 30 శాతం ఓటింగ్ పవర్, ఆయన ఛైర్మన్‌గా కొనసాగుతూ రోజూ కార్యాలయానికి వచ్చి సలహాలు ఇస్తానని ప్రకటించడం పెట్టుబడిదారులకు భరోసానిస్తోంది. కొత్త నాయకత్వం, పాత తత్వం కలిసిన ఈ దశలో బెర్క్‌షైర్ హాత్వే భవిష్యత్ ఎలా రూపుదిద్దుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications