ఎయిర్‌లైన్స్ స్టాక్స్ విక్రయించడం బెర్క్‌షైర్ హాత్‌వే అధినేత వారెన్ బఫెట్ చేసిన పెద్ద పొరపాటు అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఏప్రిల్ నెలలో బఫెట్ తన ఎయిర్ లైన్స్ స్టాక్ హోల్డింగ్స్ విక్రయించారు. ఇది అతను చేసిన అరుదైన పొరపాటు అన్నారు.

జీవితంలో అన్ని సరిగ్గానే.. కానీ పొరపాటు చేసాడు
వారెన్ బఫెట్ తన జీవితంలో అన్నీ సరిగ్గా ఆలోచించారని, సరైన మార్గాలో నడిచారని, కానీ ఇలాంటి వారు ఎప్పుడో ఒకసారి పొరపాటు చేస్తారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అతని పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఎయిర్ లైన్స్ స్టాక్స్ పైకి ఎగిశాయి. దీంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆ షేర్లు అమ్మారు
బెర్క్‌షైర్ హాత్‌వే వారెన్ బఫెట్‍కు చెందిన సంస్థ. అమెరికాలోని నాలుగు పెద్ద విమానయాన సంస్థలైన అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లలో పెట్టుబడులను వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా స్టాక్స్‌లో పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం తప్పుడు నిర్ణయమన్నారు ట్రంప్. ఈ సంస్థల షేర్ల విలువ శుక్రవారం భారీగా పెరిగి వరుసగా 18 శాతం, 9 శాతం, 5 శాతం, 13 శాతం ఎగిశాయి. బఫెట్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ట్రంప్ పేర్కొంటూ కొన్నిసార్లు బఫెట్ లాంటివారు కూడా తప్పులు చేస్తారన్నారు.

ఎందుకు వెనక్కి తీసుకున్నారు
వ్యాపారంలో ఎంతో అనుభవమున్న బఫెట్ కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ విమానయాన రంగాల్లో తన మొత్తం వాటాలను ఏప్రిల్లో అమ్మేశారు. వీటి విలువ 400 కోట్ల డాలర్లు. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.30 వేల కోట్లు వరకు ఉంటుంది. ఈ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడంపై బఫెట్ అప్పట్లోనే వివరణ ఇచ్చారు. విమానయాన సంస్థల వ్యాపారాన్ని తాను సరిగా అర్థం చేసుకోలేదన్నారు. భవిష్యత్తులో ఈ నాలుగు విమానయాన సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు భారీస్థాయిలో అప్పులు చేయాల్సి ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications