Warren Buffett 6 Billion Dollars Donation: ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నిర్వహిస్తున్న గేట్స్ ఫౌండేషన్‌కు రూ.50 వేల కోట్లు విరాళంగా ప్రకటించారు. బఫెట్ ఇప్పటివరకు అందించిన విరాళాల్లో ఇది అతిపెద్ద వార్షిక విరాళంగా మనం చెప్పుకొవచ్చు. గేట్స్ ఫౌండేషన్‌తో పాటుగా మరో నాలుగు కుటుంబ ఛారిటీ సంస్థలకు ఆయన 6 బిలియన్ డాలర్లు విలువైన బెర్క్‌షైర్ హాత్ వే షేర్లను అందించారు.
ప్రస్తుతం ఫోర్బ్స్ మ్యాగజైన్ ధనవంతుల జాబితాలో వారెన్ బఫెట్ 152 బిలియన్ డాలర్ల నికర విలువతో ఐదో స్థానంలో ఉన్నారు. అయితే ఈ విరాళం తర్వాత బఫెట్ సంపద తగ్గడంతో ఆయన ఆరో స్థానానికి చేరుకున్నారు. తాజాగా దాన కర్ణుడు అందించిన విరాళాన్ని మనం చూసినట్లయితే.. గేట్స్ ఫౌండేషన్‌కు 9.43 మిలియన్ షేర్లు బదిలీ చేయగా.. సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు 9.4 లక్షల షేర్లు బదిలీ చేశారు.ఇక బఫెట్ పిల్లలు హోవార్డ్, సూసీ, పీటర్ నిర్వహిస్తున్న మూడు ఛారిటీ సంస్థలకు మొత్తంగా 6.6 లక్షల షేర్లను కేటాయించారు.

ఇంత పెద్ద మొత్తాన్ని వదులుకున్న తర్వాత కూడా బెర్క్‌షైర్ హాత్ వే సంస్థలో బఫెట్ వాటా ఇంకా 13.8 శాతం అలాగే ఉంది. అయితే ఈ విరాళానికి ముందు బఫెట్ నికర సంపద 152 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం ఆయనకు 94 ఏళ్ల వయసు. గత ఏడాది జూన్‌లో ఆయన 530 కోట్ల డాలర్లకుకు పైగా విరాళం ఇచ్చాడు. ఇక నవంబర్‌లో మరో 114 కోట్ల డాలర్లను కుటుంబ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చాడు బఫెట్.
ప్రస్తుతం 94 ఏళ్ల వయసు కలిగిన వారెన్ బఫెట్ 2006 నుండి తన సంపదలో కొంత భాగాన్ని విరాళాలుగా ఇవ్వడం మొదలుపెట్టాడు. విరాళాల కోసం గత సంవత్సరం బిజినెస్ టైకూన్ తన వీలునామాను కూడా మార్చుకున్నాడు. ఈ వీలునామాలో తన మరణం తర్వాత తన సంపదలో 99.5% ఛారిటబుల్ ట్రస్ట్‌కు ఇవ్వబడుతుందని రాసుకున్నారు.
ఈ ట్రస్ట్‌ను అతని పిల్లలు నిర్వహిస్తారని వీలునామాలో చెప్పుకొచ్చారు. లెజెండరీ బిలియనీర్ బఫెట్ కు ముగ్గురు పిల్లలు. 71 ఏళ్ల సూసీ బఫెట్, 70 ఏళ్ల హోవార్డ్ బఫెట్, 67 ఏళ్ల పీటర్. అయితే వీలునామా ప్రకారం.. బఫెట్ డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలో నిర్ణయించుకోవడానికి దాదాపు పదేళ్ల సమయం ఉంటుంది. అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
వారెన్ బఫెట్ తెలిపిన వివరాల ప్రకారం అతని మరణం తర్వాత గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు ఆగిపోతాయి. వారెన్ బఫెట్ 1965 నుండి బెర్క్‌షైర్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. 1.05 ట్రిలియన్ల డాలర్ల విలువైన ఈ సమూహం JEICO కార్ ఇన్సూరెన్స్, BNSF రైల్‌రోడ్‌తో సహా దాదాపు 200 వ్యాపారాలను కలిగి ఉంది. ఈ కంపెనీ ఆపిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో సహా డజన్ల కొద్దీ కంపెనీల స్టాక్‌లను కూడా కలిగి ఉంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications