Super Stock: ఈ కంపెనీలో ఒక్క షేర్ ఉన్నవారు సైతం కోటీశ్వరులయ్యారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాక్ గా ఉంది. ఒక సామాన్యుడు జీవితకాలం కష్టపడినా భవిశా ఇంత సంపాధించటం కష్టం కావచ్చు. కానీ ఈ స్టాక్ అనేక మంది ఇన్వెస్టర్ల తలరాతను మార్చేసింది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వారెన్ బఫెట్..
ప్రపంచానికి ఆర్థిక పాఠాలు నేర్పిన వ్యక్తి వారెన్ బఫెట్. ఆయన బాటలో నడిచి ఆర్థిక అంశాలలో విజయాలు సాధించిన వారు అనేక మంది. పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఫైనాన్స్ మేనేజే మెంట్ ఎలా ఉండాలి, ప్రణాళికతో పెట్టుబడులు పెట్టడం ఎలా, వృధాగా వేటిపై ఇన్వెస్ట్ చేస్తే ఆర్థికంగా నష్టపోతారు వంటి అనేక విషయాలు బఫెట్ నుంచే నేర్చుకోవాలి. ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్న కంపెనీ ఈయనకు సంబంధించినదే.

స్టాక్ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఖరీదైన స్టాక్ Berkshire Hathaway Inc కంపెనీదే. ఈ కంపెనీకి చెందిన ఒక షేరు ధర ప్రస్తుతం భారత కరెన్సీ ప్రకారం రూ.3.33 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ విలువ 4,17,250 డాలర్లు అంటే రూ.3,33,43,907గా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఈ షేర్ విలువ 5,23,550 డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీ ప్రకారం దాని విలువ రూ.4,00,19,376. అంటే.. గత మూడు నెలల్లో ఈ స్టాక్ దాదాపు 20 శాతం పడిపోయింది. కానీ.. ఈ ఒక్క షేర్‌తో మీరు ఇల్లు, కారు, లగ్జరీ వస్తువులు ఇలా విలాసవంతమైన వస్తువులను సులువుగా కొనుగోలు చేయవచ్చు.

సామాన్యులు ఈ స్టాక్‌ను కొనగలరా..?
ఈ స్టాక్‌ను కొనుగోలు చేయడం చాలా మంది సామాన్యుల ఏకైక కల. ఇప్పుడు ఈ బెర్క్‌షైర్ హాత్వే ఇంక్ కంపెనీకి అధిపతి ప్రపంచ ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్. ఈ కంపెనీలో ఆయనకు 16 శాతం వాటా ఉంది. కంపెనీ వ్యాపారంలో ఎక్కువ భాగం అమెరికాలోనే ఉంది. కంపెనీలో దాదాపు 3,72,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బెర్క్‌షైర్ హాత్వే ఇంక్ అమెరికాతో పాటు చైనాలోనూ విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. 1965లో వారెన్ బఫెట్ ఈ టెక్స్‌టైల్ కంపెనీని కొనుగోలు చేసినప్పుడు ఒక్కో షేర్ విలువ 20 డాలర్ల కంటే తక్కువగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications