buffet: స్టాక్ మార్కెట్లో వారెన్ బఫెట్ అంటే తెలియని ఇన్వెస్టర్ ఉండరేమో. అంతటి గొప్ప వ్యక్తి, బిలినియర్. ఆయన చెప్పే సూత్రాలను పాటిస్తూ, పెద్ద మొత్తంలో ఆర్జించే ట్రేడర్స్ ఉన్నారంటే ఆయన విలువేంటో అర్థం చేసుకోవచ్చు. ఏడాదికోసారి ఇన్వెస్టర్లకు ఆయన సలహాలు ఇస్తుంటారు. ఓ లేఖ ద్వారా తన ఆలోచనలు, సూచనలను పంచుకుంటూ ఉంటారు. దానిపై మార్కెట్ లో పెద్ద చర్చ నడుస్తుంది. తాజాగా ఇది విడుదల కాగా.. అందులో ఏముంది ? ఆయన ఎటువంటి సూచనలు చేశారో ఇప్పుడు చూద్దాం

కోకో-కోలా, అమెరికన్ ఎక్స్ ప్రెస్:
పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారెన్ బఫెట్ లేఖను.. వార్షిక నివేదికతో పాటు తన కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే విడుదల చేసింది. కోకో-కోలా, అమెరికన్ ఎక్స్ ప్రెస్ కంపెనీల్లో తన పెట్టుబడుల గురించి ఆయన అందులో పేర్కొన్నారు. 2.6 బిలియన్ డాలర్లను రెండు దశాబ్దాల్లో 47 బిలియన్లుగా ఎలా మార్చారో వివరించారు. 1994 ఆగస్టు నాటికి 400 మిలియన్ల కోకో-కోలా షేర్లను కొనుగోలు చేసి ఏడేళ్లు గడిచినట్లు బఫెట్ చెప్పారు. అప్పటికి వాటి విలువ 1.3 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించారు.అమెరికన్ ఎక్స్ ప్రెస్ లోనూ దాదాపు ఇదే మొత్తాన్ని పెట్టినట్లు తెలిపారు.

75 నుంచి 704 మిలియన్ డాలర్లకు:
అదే ఏడాది కోకో-కోలా నుంచి 75 మిలియన్ డాలర్లను క్యాష్ డివిడెండ్ కింద అందుకున్నట్లు లేఖలో వెల్లడించారు. 2022 నాటికి ఆ డివిడెండ్ విలువ 704 మిలియన్ డాలర్లకు పెరిగినట్లు తెలిపారు. వయసు ఏ విధంగా పెరుగుతుందో అలాగే ఏడాదికేడాది డివిడెండ్ సైతం పెరుగుతూ వచ్చినట్లు చెప్పారు. కేవలం తాము త్రైమాసికానికి ఒకసారి వస్తున్న ఆదాయాన్ని లెక్క వేసుకోవడం తప్ప, చేసింది ఏమీ లేదన్నారు. భవిష్యత్తులో ఈ షేర్ల విలువ ఎలా ఉంటుంది అనే విషయాన్ని పెట్టుబడి పెట్టక ముందు క్షుణ్ణంగా పరిశీలించి, విలువ పెరుగుతుందని ముందే ఊహించినట్లు వివరించారు.

హోల్డింగ్స్ లో 5 శాతం:
అమెరికన్ ఎక్స్ ప్రెస్ విషయంలోనూ దాదాపు ఇదే విధంగా జరిగినట్లు బఫెట్ వెల్లడించారు. 1995లో దాదాపు 1.3 బిలియన్ డాలర్లతో షేర్లు కొన్నట్లు చెప్పారు. 41 మిలియన్ డాలర్ల మంచి మొదలైన వార్షిక డివిడెండ్, 302 మిలియన్లకు పెరిగాయన్నారు. కొన్న విలువతో పోలిస్తే ఇది అంత పెద్ద మొత్తం కానప్పటికీ, స్టాక్ విలువ పెరగడంలో డివిడెండ్ల పాత్ర ఎంతో ఉందని గమనించాలని సూచించారు. ఈ సంవత్సరాంతానికి కోక్ లో పెట్టుబడి విలువ 25 బిలియన్ డాలర్లు కాగా, అమెక్స్ విలువ 22 బిలియన్లకు చేరినట్లు పేర్కొన్నారు. వీటి నికర విలువ తన కంపెనీలో హోల్డింగ్స్ లో దాదాపు 5 శాతం ఉందని స్పష్టం చేశారు.

అప్పుడే సరైన విలువ:
అయితే ఇదే మొత్తాన్ని అమెక్స్, కోకోకోలాలో కాకుండా 30 ఏళ్ల హై గ్రేడ్ బాండ్స్ లో పెట్టినట్లయితే.. బెర్క్‌షైర్ లో వాటి విలువ కేవలం 0.3 శాతం మాత్రమే ఉండేదన్నారు. 1990లలో ఈ పని చేసి ఉంటే, 2022 నాటికి పెట్టుబడిగా పెట్టిన అదే 1.3 బిలియన్ డాలర్ల సంపద మాత్రమే మిగిలేదని చెప్పారు. అప్పటి లాగానే ఇప్పటికీ 80 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం మాత్రమే పొందగలిగే వాడినని స్పష్టం చేశారు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, షేర్ విలువ పెరుగుదలను అంచనా వేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అప్పుడే పెట్టిన ఇన్వెస్ట్ మెంటుకు సరైన విలువ పొందవచ్చని హితవు పలికారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications