AI: అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్, బెర్క్ షైర్ హాత్వే CEO వారెన్ బఫెట్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. AI సాంకేతికత ప్రపంచాన్ని ఏవిధంగా మార్చగలదో తలచుకుని ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. అన్నింటినీ ఈ టెక్నాలజీ మార్చగలదని అభిప్రాయపడ్డారు. తన కంపెనీ వార్షిక సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఆటమ్ బాంబ్ సృష్టితో పోల్చారు వారెన్ బఫెట్. ఈ కొత్త సాంకేతికత వేగవంతమైన పురోగతి ప్రపంచాన్ని అధోగతి పాలుచేస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. దానికి కొన్ని పరిమితులున్నా, అన్ని రకాల పనులు చేసే సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉన్నట్లు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సహాయంతో ChatGPTని ఉపయోగించుకునే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు.

అణ్వాయుధాలను తీవ్రంగా వ్యతిరేకించే వారిలో బఫెట్ ఒకరు. ఈ తరహా అస్త్రాల వినియోగాన్ని తగ్గించడానికి అవసరమైతే తన సంపదనంతా వెచ్చిస్తానని ఆయన గతంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో AI సాంకేతికతను ఆయన ఆటమ్ బాంబ్ తో పోల్చడం ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా చూస్తే, కృత్రిమ మేధస్సు కూడా అంతటి ప్రమాదకరం అన్నట్లుగా ఈ బిలియనీర్ అభిప్రాయపడ్డారు.
కొత్త టెక్నాలజీ మార్కెట్ లోకి వచ్చినంత మాత్రాన ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే భావనను వారెన్ బఫెట్ ఖండించారు. అయితే బఫెట్ కూడా AI గాడ్ ఫాదర్ గా గుర్తించబడిన జెఫ్రీ హింటన్ వలె సైతం కృత్రిమ మేధకు వ్యతిరేకంగా గొంతు విప్పడం విశేషం. తను చేసిన ఈ పనికి జీవితాంతం పశ్చాత్తాప పడతానని కూడా ప్రకటించారు. వాతావరణ మార్పులను గాడిలో పెట్టడం కంటే AIని కట్టడి చేయడమే ప్రస్తుతం ప్రపంచానికి అత్యవసరమంటూ ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications