తాజాగా గ్రాడ్యుయేట్ అయిన ఒక యువకుడు, బెంగళూరులోని ఒక స్టార్ట్‌ప్ సంస్థలో మిషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌గా ఉద్యోగంలోకి అడుగుపెట్టాడు. ఉత్సాహంతో వచ్చిన ఈ ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆఫీసులో తొలిరోజుల్లో ఆశతో అడుగుపెట్టిన ఈ యువ ఉద్యోగి, తనకు ఎదురైన పద్ధతి లేని పని శైలి, కష్టమైన టాస్కులు, ఆ కంపెనీలో మనుషులను సరిగా చూడరని నెమ్మదిగా తెలుసుకున్నాడు.

ఆ కంపెనీలో తన సామర్థ్యాన్ని పెంచుకుందాం అని అనుకుంటే ఒకే రకమైన, పాత టాస్కులనే పదే పదే చేయాల్సి రావడం వల్ల, అసలు తన లక్ష్యాలేమిటో తెలియని పనుల మధ్య చిక్కుకున్నాడు. దీనివల్ల అతనికి ఉద్యోగంపై ఆసక్తి తక్కువ అయింది. అసలు తన ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ లేకుండా చూడటంతో, సంస్థ సంస్కృతి పట్ల తీవ్ర అసంతృప్తి పెరిగింది.
ఆరోగ్య కారణంగా సెలవు.. కానీ హెచ్‌ఆర్ నోటీసు
ఒకరోజు అనారోగ్యంతో సెలవు తీసుకున్న ఆ యువ ఇంజినీర్‌కు మేనేజర్ నుంచి సహాయం లభించలేదు. బదులుగా, మేనేజర్ నేరుగా హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉద్యోగికి హెచ్చరిక లేఖని పంపించారు. ఇది అతని మనసును చాలా బాధ పెట్టింది. తన మాటలకు విలువ ఇవ్వడం లేదు, గౌరవం లేదు అన్న అనుభూతి అతనిలో పెరిగింది.
ఈ పరిస్థితుల మధ్య యువ ఇంజినీర్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయానికి చేరుకున్నాడు. ఉద్యోగ భద్రత కోసం కష్టమైన వాతావరణంలో కొనసాగాలా? లేక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలా? ఇప్పటివరకు కొత్త ఆఫర్ ఏదీ లేకపోవడంతో రిజైన్ చేయడం సరైన దారేన అని ఆలోచిస్తున్నాడు.
ఈ కథ Reddit లో పోస్ట్ అయ్యాక, చాలా మంది యువ ఉద్యోగులు తమ అనుభవాలు పంచుకున్నారు. ఒకరు "మీ మానసిక ప్రశాంతతకు మించిన జీతం ఏదీ కాదు" అంటూ అన్నారు. మరొకరు "ముందుగా మంచి అవకాశాన్ని సిద్ధం చేసుకుని, ఆ తరువాతే రిజైన్ చేయడం ఉత్తమం" అని ప్రాక్టికల్ సలహా ఇచ్చారు.
అలాగే, కొన్ని స్టార్టప్‌లు ఫ్రెషర్స్‌ను నిరంతరం మెకానికల్ టాస్కులకే ఉపయోగించుకుని, వారి అభివృద్ధిని పట్టించుకోకుండా ఉంటాయని పలు కామెంట్లు వెలువడ్డాయి. ఇటువంటి చోట్ల, ఉద్యోగి గౌరవం, అభిప్రాయం, అభివృద్ధికి విలువ ఉండదు అని వారు అభిప్రాయపడ్డారు. ఈ యువ ఇంజినీర్ ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా మంది యువ ఉద్యోగుల వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. ఒకవైపు మన ఆశలు, అభిప్రాయాలు మరోవైపు అనుభవిస్తున్న అసహ్యం, నిరాశ.
ఆర్థికంగా చూస్తే ఉద్యోగాన్ని కొనసాగించడం అవసరం. కానీ మానసికంగా చూస్తే ఆ కార్యాలయ వాతావరణం మరింత ఒత్తిడికి దారి తీస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.
చాలా స్టార్టప్‌లు సిస్టమ్ లేకుండా నడుస్తాయి. పనులకీ గడువు ఉంటుంది కానీ దిశ ఉండదు. ఉద్యోగి అభివృద్ధిపై కాకుండా, తాత్కాలిక పనుల్లో ఉపయోగించడం. పనిలో విలువను తెలియజేయకపోవడం, అభిప్రాయాలను తీసుకోకపోవడం.
ఉద్యోగులు కూడా మనుషులే. శరీరానికి విశ్రాంతి అవసరమే. ఒక్క రోజు సెలవు తీసుకున్నందుకు హెచ్చరిక ఇవ్వడం అనేది అసమర్థతను సూచిస్తుంది. దీనివల్ల "ఆఫీస్‌కి పనివాళ్ళు కావాలి, మనుషులు కాదు" అన్న భావన కలుగుతుంది.
ఈ సంఘటన అనేక మంది యువ సాంకేతిక నిపుణులు ఎదుర్కొంటున్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. ఉద్యోగ భద్రత సరిపోయే స్థాయిలో అవసరం అయినా, మానసిక ఆరోగ్యం, ఆత్మ గౌరవం తీసిపోవటం ఉండకూడదు. ప్రస్తుత అనుభవాలనుంచి నేర్చుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎదుగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications