ఢిల్లీ, ముంబై రేంజ్‌లో వరంగల్ ఎయిర్‌పోర్ట్.. సెల్ఫ్ చెక్-ఇన్, స్మార్ట్ ఫీచర్లతో మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఓరుగల్లు వాసులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. తెలంగాణలో రెండో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అడుగులు చాలా వేగంగా పడుతున్నాయి. చారిత్రక నగరమైన వరంగల్ (Warangal) లో ఈ సరికొత్త విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పనులను స్పీడప్ చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పర్యావరణ అనుమతులు (Environmental Clearance) సాధించేందుకు ఒక కన్సల్టెంట్‌ను నియమించే ప్రక్రియను కూడా AAI మొదలుపెట్టేసింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం ఈ కన్సల్టెంట్ ఆరు నెలల్లోగా అన్ని అనుమతులు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడేళ్ల పాటు పర్యావరణ నిబంధనల పర్యవేక్షణ కూడా వీరే చూసుకుంటారు.

Warangal Airport Update Telangana Second Airport Runway Terminal Features And AAI Tender Details

2.5 కిలోమీటర్ల రన్‌వే.. అదిరిపోయే స్మార్ట్ టెర్మినల్!

ఈ సరికొత్త ఎయిర్‌పోర్ట్ ప్లాన్ చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ఇందులో దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించబోతున్నారు. దీనివల్ల పెద్ద పెద్ద విమానాలు కూడా ఇక్కడ చాలా ఈజీగా ల్యాండ్ అవ్వడానికి, టేకాఫ్ అవ్వడానికి వీలుంటుంది. ఇక ఇక్కడ కట్టబోయే డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్ సుమారు 6,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ సదుపాయంతో వన్-అండ్-హాఫ్ లెవెల్ స్ట్రక్చర్‌గా రూపుదిద్దుకోనుంది. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో సైతం ఒకేసారి దాదాపు 850 మంది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు అందించేలా దీని డిజైన్ సిద్ధం చేశారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రూల్స్ ప్రకారం అత్యంత సురక్షితమైన ప్రమాణాలతో దీనిని నిర్మిస్తున్నారు.

హైదరాబాద్ రేంజ్‌లో లగ్జరీ ఫీచర్లు.. సెల్ఫ్ చెక్-ఇన్ కౌంటర్లు!

ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లిన ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఇంటీరియర్స్ ప్లాన్ చేస్తున్నారు. లగేజ్ కన్వేయర్ సిస్టమ్స్, క్యూ మేనేజ్మెంట్ ఏరియాలు, ఫెసిలిటేషన్ డెస్క్‌లు, లాస్ట్ అండ్ ఫౌండ్ సెక్షన్లతో పాటు ప్రయాణికులు ఎవరి సాయం లేకుండానే బోర్డింగ్ పాస్ తీసుకునేలా 'సెల్ఫ్ సర్వీస్ చెక్-ఇన్ కియోస్క్‌లను' ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇవే కాకుండా ప్రయాణికులు హాయిగా కూర్చోవడానికి బస్ లాంజ్‌లు, స్మోకింగ్ రూమ్స్, చిన్న పిల్లల కోసం చైల్డ్ కేర్ రూమ్స్, అత్యాధునిక వాష్ రూమ్స్ లాంటి ఎన్నో లగ్జరీ వసతులు ఇందులో ఉండబోతున్నాయి.

దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత.. హై-సెక్యూరిటీ సిస్టమ్స్!

ఈ వరంగల్ (Warangal) ఎయిర్‌పోర్ట్‌లో దివ్యాంగులు, వృద్ధులు , నడవడానికి ఇబ్బంది పడే ప్రయాణికుల (PRMs) కోసం ప్రత్యేకంగా యాక్సెసిబిలిటీ ఫీచర్లను డిజైన్ చేస్తున్నారు. వారు ఎవరి సాయం లేకుండా నడవడానికి వీలుగా టాక్టైల్ ఫ్లోరింగ్, వీల్‌చైర్ ర్యాంపులు, , చూపు, వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేక మౌలిక వసతులను సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం ఏర్పాటు చేయనున్నారు. సెక్యూరిటీ పరంగా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. డోర్-ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, అత్యాధునిక ఎక్స్-రే బ్యాగేజ్ స్కానర్లు, ప్రత్యేక ఫ్రిస్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు.

ఓరుగల్లు సంస్కృతి ఉట్టిపడేలా అద్భుతమైన డిజైన్!

వరంగల్ అంటేనే కాకతీయుల కళల నిలయం. అందుకే కేవలం ఆధునిక వసతులే కాకుండా, ఈ ఎయిర్‌పోర్ట్ కట్టడాలలో స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్లాన్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ లోపల, బయట వరంగల్ చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా స్థానిక కళాకారులు తయారు చేసిన అద్భుతమైన కళాఖండాలు, పెయింటింగ్స్ , డెకరేటివ్ ఎలిమెంట్స్‌ను ప్రదర్శించనున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే పర్యాటకులకు ఓరుగల్లు గొప్పతనం ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఎయిర్‌పోర్ట్ కనుక అందుబాటులోకి వస్తే.. వరంగల్ చుట్టుపక్కల జిల్లాల బిజినెస్, టూరిజం రేంజ్ పూర్తిగా మారిపోవడం ఖాయం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+