తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముగిసిన సంగతి మీకు తెల్సిందే. అయితే ఈసారి ఛాంపియన్‌షిప్ కప్'ని ఇండియా సొంతం చేసుకుంది. మరికొద్దీ రోజుల్లోనే IPL 2025 సీజన్ ప్రారంభం కానుంది. దింతో క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఈ తరుణంలో అన్ని టెలికాం కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. ఈ ప్లాన్స్ క్రికెట్ ప్రియుల కోసం తక్కువ ధరకే లభిస్తున్నాయి.
ముఖ్యంగా క్రికెట్ అభిమానులను ఆకర్షించడానికి టెలికాం కంపెనీలు ఈ కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టాయి. వీటిలో రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా బడ్జెట్ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించాయి. ప్రస్తుతం జియో రెండు రీఛార్జ్ ప్లాన్స్ జియోహాట్‌స్టార్‌కు మూడు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నాయి. ప్రత్యేకతమైన విషయం ఏమిటంటే దీని ధర కూడా రూ.200 కంటే తక్కువే. వోడాఫోన్ ఐడియా ప్లాన్లలో కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. ఇంకా మీరు IPL 2025ని ఉచితంగా చూడవచ్చు.

జియో కొత్తగా ఓ ప్రీపెయిడ్ ప్లాన్ (మొబైల్ సబ్‌స్క్రిప్షన్)ను ప్రకటించింది. ఇటీవలే జియో హాట్‌స్టార్ విలీనమై జియో హాట్‌స్టార్‌గా ఏర్పడ్డాయి. జియో కస్టమర్లు కొత్త OTT ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ OTT ప్లాట్‌ఫామ్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా వివిధ రీఛార్జ్ ప్లాన్‌లతో వస్తుంది.
1. జియో రూ.100 రీఛార్జ్ ప్లాన్
జియో రూ.100కి ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 90 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇంకా 5GB వరకు డేటా ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా అయిపోయిన తర్వాత డేటా 64 GBPSకి స్పీడ్ పడిపోతుంది. ఈ ప్లాన్ ద్వారా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. మీరు స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్ టీవీలో జియో హాట్‌స్టార్‌ను ఉచితంగా చూడవచ్చు. మీరు మొబైల్‌లో మాత్రమే కాకుండా స్మార్ట్ టీవీలో కూడా 90 రోజుల వాలిడిటీతో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అయితే, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ రూ.195 ప్లాన్, రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్‌లతో కూడా ఉచితంగా లభిస్తుంది.
2. జియో రూ.195 రీఛార్జ్ ప్లాన్
ఈ జియో రూ.195 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో 15GB డేటా లభిస్తుంది. మీరు 90 రోజుల పాటు JioHotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. కానీ కేవలం జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.149. అలాగే ఒక సంవత్సరానికి రూ.499 చెల్లించాలి. మీరు 720p వీడియో క్యాలిటీతో మొబైల్‌లో IPL చూడవచ్చు.
3. జియో రూ. 949 రీఛార్జ్ ప్లాన్
జియో రూ.949 ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. మీరు రోజుకు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. మీరు 84 రోజులకి మొత్తం 168GB డేటా పొందుతారు. ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 5G కనెక్షన్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. దీనితో పాటు మీరు జియో హాట్‌స్టార్, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా పొందవచ్చు.
4. వోడాఫోన్ ఐడియా రూ. 469 ప్లాన్
జియోలాగే వోడాఫోన్ ఐడియా కూడా రీఛార్జ్ ప్లాన్‌లతో ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 2.5GB డేటా, 100 SMSలను అందిస్తుంది. ఇందులో 3 నెలల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. వాలిడిటీ 28 రోజులు అయినప్పటికీ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల వరకు ఉంటుంది.


Click it and Unblock the Notifications