మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇప్పుడు డైలీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP)లను ప్రవేశపెట్టాయి. దింతో ఇప్పుడు మీరు ప్రతిరోజు కూడా SIP మ్యూచువల్ ఫండ్‌లో నిర్ణయించిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. డైలీ SIPలు ప్రతిరోజు వేతనం లేదా డబ్బు సంపాదించే వారికి చాల ఉపయోగపడుతుంది.

కొన్ని అధ్యయనాలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIPలు) ప్రతిరోజు, వారానికి ఒకసారి లేదా ప్రతినెల పెట్టుబడి రిటర్న్స్ పెద్దగా ప్రభావం చేయదని సూచిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ అప్షన్స్ మధ్య రాబడిలలో తేడాలు కూడా తక్కువగా ఉంటాయి. అయితే, మీరు ప్రతిరోజు అంటే డైలీ SIP కావాలనుకుంటే మీ పెట్టుబడులను ట్రాక్ చేయడం మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ ప్రతినెల SIP చాల తెలివైన అప్షన్'గా ఉంటుంది, ముఖ్యంగా ప్రతినెల ఫిక్స్డ్ జీతం ఉన్నవారికి ఇదొక ఇన్కమ్ సైకిల్'తో బాగా సరిపోతుంది.
ఈ పెట్టుబడి ద్వారా మరొక విషయం ఏమిటంటే డైలీ SIPలు మిడ్-క్యాప్ అండ్ స్మాల్-క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడుల ద్వారా ఉంటుంది, ఇవి ఎక్కువ అస్థిరతతో ఉంటాయి. దింతో ప్రతిరోజు పెట్టుబడి ప్రతినెల పెట్టుబడులతో పోలిస్తే ఎక్కువ హెచ్చుతగ్గులకు దారితీయవచ్చు. అయితే మీరు లార్జ్-క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంటే డైలీ SIPలు ఎక్కువగా ఫిక్స్డ్ రాబడిని ఇస్తాయి. ప్రతిరోజు జీతం తీసుకుంటున్న వ్యక్తులకు డైలీ SIPలు సరైన అప్షన్ అని చెప్పొచ్చు.
SIPల రకాలు : SIPలు కాలపరిమితి ఆధారంగా ఉంటాయి.
ప్రతినెల SIP: మ్యూచువల్ ఫండ్‌లో ప్రతినెల ఒక ఫిక్స్డ్ మొత్తాన్ని పెట్టుబడి పెడతారు.
ప్రతి వారం SIP: మ్యూచువల్ ఫండ్ స్కింలో ప్రతి వారానికి ఒకసారి ఫిక్స్డ్ మొత్తాన్ని పెట్టుబడి పెడతారు.
ప్రతిరోజు SIP: మ్యూచువల్ ఫండ్‌లో ప్రతిరోజూ ఒక ఫిక్స్డ్ మొత్తాన్ని పెట్టుబడి పెడతారు.
చాల పెట్టుబడి సంస్థలు ప్రతినెల SIPలను ఆకట్టుకునే విధంగా చేసినప్పటికీ, డైలీ లేదా వారానికి ఒకసారి SIPలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండకపోవచ్చు. కానీ ప్రతిరోజూ లేదా ప్రతి వారం, ప్రతినెల SIPలకి మీరు రిమైండర్‌లను సెట్ చేసుకోవాలి ఇంకా మీ షెడ్యూల్‌లో టైం కేటాయించాలి. అంతేకాకుండా మీ రికార్డ్ కీపింగ్ అవసరాలు కూడా పెరుగుతాయి. మీరు ప్రతినెల SIP తీసుకుంటే మీకు సంవత్సరానికి పన్నెండుసార్లు పెట్టుబడులు ఉంటాయి. మరోవైపు వారానికి ఒకసారి SIPలను సెలెక్ట్ చేసుకుంటే సంవత్సరానికి యాభై రెండుసార్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ప్రతిరోజు లేదా ప్రతి వారం SIPలతో ట్యాక్స్ మెయింటెనెన్స్ క్లిష్టంగా మారుతుంది, ఎందుకంటే ప్రతి SIP విడిగా ఎంటర్ చేయాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. చివరికి SIPల ద్వారా మీ రాబడి పెంచుకోవాలంటే సాధారణ తప్పులను చేయకుండా ఫిక్స్డ్ మొత్తం ఇంకా క్రమం తప్పకుండ పెట్టుబడి చేయడం అవసరం.


Click it and Unblock the Notifications