బడ్జెట్ వస్తోందంటే చాలు సంపన్నుల నుంచి సామాన్యుల వరకు తమకు ప్రయోజనం కలిగే ఏదో ఒక ప్రకటన వెలువడక పోతుందా అని ఎదురు చూస్తుంటారు. తమకు అనుకూలంగా ప్రకటన ఉంటే సంబరపడి పోతారు. ప్రతికూలంగా ఉంటే నిరాశ చెందుతారు. కొన్ని ప్రకటనల గురించి కొంత మందికి అర్థం కూడా కాదు. కొన్ని ప్రకటనలు మాత్రం ఎంతో ఆలోచింపజేస్తాయి. అప్పుడు ఇలాంటి సలహా ఎవరు ఇచ్చారా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తమకు ఒక అవకాశం లభిస్తే తమ ఆలోచనను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని కొంతమంది భావిస్తుంటారు. అయితే ఆ అవకాశం కొంత మందికి మాత్రమే ఉంటుందని తెలుసుకుని నిరాశ చెందుతారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాల ఆలోచనా ధోరణి మారుతోంది. ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు, సూచనలు తీసుకొని వాటిలో ప్రయోజనకరంగా ఉన్న వాటిని బడ్జెట్ లో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సారి బడ్జెట్ లో ప్రజల నుంచి సలహాలు సూచనలు కోరుతున్నారు. మీరు కూడా ఇందులో పాల్గొనవచ్చు.

20వ తేదీ వరకు గడువు
* దేశంలోని మెజారిటీ ప్రజలు కోరుకునేది పన్నుల భారాన్ని ప్రభుత్వం తగ్గించాలని. ముఖ్యంగా ఆదాయ పన్ను ను తగ్గిస్తే చాలా మందికి ఎంతో ఉపశమనం లభిస్తున్నది. పన్ను ప్రయోజనాలను మరింతగా పెంచితే బాగుండు అని కొందరు ఆశిస్తారు. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి ఆశలు మరో విధంగా ఉంటాయి. ఇలా సమాజంలోని ఒక్కో వ్యక్తి ఆశ ఒక్కో విధంగా ఉంటుంది. ఇలాంటి వాటి గురించే కాకుండా ప్రభుత్వానికి మంచి ఆలోచనలు లేదా సలహాలను తెలియజేయవచ్చు. ఈ సలహాలను ప్రభుత్వానికి వచ్చే నెల 20వ తేదీ వరకు తెలియజేయవచ్చు.
* ఎలా తెలియజేయాలంటే.. myGov.in వెబ్ సైట్ లోకి ఎంటర్ అయితే అందులో ఇన్విటింగ్ ఐడియాస్ అండ్ సజెషన్స్ ఫర్ యూనియన్ బడ్జెట్ 2020-2021 అని ఉంటుంది. దీని ద్వారా మీరు మీ సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళవచ్చు. అంతే కాకుండా ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన @FinMinIndia ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా తెలియజేయవచ్చు. ట్విట్టర్ ద్వారా ఇప్పటికే అనేక మంది పౌరులు ప్రభుత్వానికి తమ వినతులను తెలియజేస్తున్నారు.
* ఆదాయ పన్ను, ఫైనాన్స్, జీఎస్టీ, ఉపాధి, ఎంట్రప్రెన్యూయర్‌షిప్, రైల్వేస్, రైతులు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా వంటి వాటికి సంబంధించి సలహాలు అందించవచ్చు.

సమ్మిళితంగా...
* బడ్జెట్ రూపకల్పనకు ముందు కేంద్ర ఆర్ధిక మంత్రి పారిశ్రామికవేత్తలు, ఆర్ధిక వేత్తలు, రైతులు, వ్యాపారులు, కేంద్ర నాయకులు, పారిశ్రామిక సంఘాలతో సమావేశం అవుతుంటారు. వారి సమస్యలు వింటారు. ఎలాంటి ప్రకటనలను కోరుకుంటున్నారు. తెలుసుకుంటారు. ఇది ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ ఏడాది ఈ ప్రక్రియను మరింత సమ్మిళితం చేసే ఉద్దేశంతో సామాన్య పౌరులు కూడా తమ సలహాలను చాలా సులభంగా తెలియజేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మొబైల్ ఫోన్ల విస్తృతి పెరిగిపోయిన నేపథ్యంలో ఎక్కువ మంది తమ సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఫిబ్రవరి 1న బడ్జెట్
* వచ్చే ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్ట నున్నారు. ఈ బడ్జెట్ లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించే అవకాశం ఉండవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్ధిక వ్యవస్థ వృద్దికోసం ఇలాంటి ప్రకటన చేయవచ్చంటున్నారు. ఇక ఇన్వెస్టర్లలో జోష్ నింపేందుకు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును తగ్గించవచ్చంటున్నారు. ఈసారి బడ్జెట్ పై అన్ని రంగాలు వర్గాలు ఆశలతో ఉన్నాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications