బిజినెస్ స్టార్ట్ చేయాల.. తక్కువ పెట్టుబడితో ఏడాది మొత్తం లాభం ఇచ్చే వ్యాపారం ఇదే..
ఈ ఏదైనా బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా... కానీ ఏ బిజినిస్ స్టార్ట్ చేయాలో తెలియడం లేదా..? అయితే మీరు కార్డ్ ప్రింటింగ్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం ఏడాది మొత్తం చేసుకోవచ్చు, ప్రతి సీజన్లోను మంచి గిరాకీ ఉంటుంది. ఇంకా ఈ బిజినెస్ మార్కెట్లోకి ఎంటర్ కావాలనుకునే వారికి చక్కటి అప్షన్. ఎందుకంటే ఈ కార్డ్ ప్రింటింగ్ వ్యాపారం ఎక్కువ నష్టం లేకుండా మొదట్లో తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేయవచ్చు.
కార్డ్ ప్రింటింగ్ వ్యాపారం
ప్రస్తుతం పెళ్లిళ్లు సీజన్ నడుస్తుంది, ఇలాంటి సమయంలో వెడ్డింగ్ కార్డ్స్ చాల ముఖ్యం. కార్డు ప్రింటింగ్ బిజినెస్ పెళ్లిళ్ల సీజన్‌లో ఎక్కవ డిమాండ్‌తో అలాగే ఏడాది పొడవునా ఆదాయం అందించే ఛాన్స్ ఉంటుంది. మనకు ఇప్పుడు మార్కెట్లో రకరకాల కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కాకుండా బర్త్ డేలు, గృహ ప్రవేశాలు అలాగే ఫంక్షన్స్ లాంటి వాటికీ సీజన్తో పని లేకుండా ప్రతినెల ఉంటాయి. ఈ కాలంలో ప్రతి ఈవెంట్ లేదా శుభుకార్యాలకి కార్డ్స్ ఇచ్చి ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులను ఇన్వైట్ చేస్తుంటారు. ఇలాంటి టైంలో కస్టమర్లకి కార్డు ప్రింటింగ్ తప్పనిసరి. కస్టమర్కి నచ్చిన విధంగా కార్డు డిజైన్ చేసి ఇస్తే మీకు అంత ప్రాఫిట్ వస్తుంది.

అత్యంత తక్కువ ధర ఉండే కార్డ్‌లపై కూడా మీరు 3 నుండి 5 రూపాయల మధ్య లాభం పొందవచ్చు, అయితే ఎక్కువ ధర ఉన్న కార్డ్స్ ప్రింటింగ్ పై 15 నుండి 20 రూపాయల లాభం ఉంటుంది. మీకు మంచి సీజన్ టైంలో ఎక్కువ గిరాకీ ఉన్నపుడు ఎక్కువ ఆర్డర్‌లపై మరింత ఎక్కువ మొత్తంలో లాభం ఉంటుంది.
ప్రింటింగ్ కావాల్సినవి ఎక్కడ పొందాలి
తక్కువ ఖర్చుతో కూడిన ఫుల్ వైట్ ప్రింటింగ్ కార్డుల కోసం హైదరాబాద్ ఒక అద్భుతమైన అప్షన్. హైదరాబాద్ హోల్‌సేల్ మార్కెట్‌లో చాలా పోటీ ధరలకు కార్డ్స్ లభిస్తాయి. ఆకర్షణీయమైన వెడ్డిండ్స్ కార్డ్స్ రూపొందించడానికి మంచి డిజైన్ కార్డ్స్ అవసరం. లేటెస్ట్ కార్డ్ డిజైన్‌లను ఆన్‌లైన్‌లో చూడవచ్చు ఇంకా కార్డ్స్ ఏ సైజ్ ఉన్న ప్రింటింగ్ మెషీన్‌లో తేడా ఉండదు. హైదరాబాద్లో మీకు కావాల్సిన డిజైన్, వెరైటీ ఇంకా రకరాల క్వాలిటీ కార్డ్స్ మీకు బడ్జెట్ ధరకే లభిస్తాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో మీరు కార్డ్స్ ఆర్డర్ చేస్తే మీకు తక్కువ ధరకు లభిస్తాయి కావాలంటే మీరు వాటిపై బేరాలు కూడా చేయవచ్చు.
Disclaimer: The recommendations made above are by experts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.


Click it and Unblock the Notifications