సొంతిల్లు కొనుక్కోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ఇల్లు అనేది ఎంతో మంది కల కదా మరి. దాన్ని నెరవేర్చుకోవడానికి నిత్యం శ్రమించే వారు అనేక మంది ఉంటారు. ఇల్లు కొనుక్కోవడానికి చాలా మంది ఎక్కడ ప్రాపర్టీ షో జరిగినా వెళ్లి తమ బడ్జెట్ లో ఏదైనా ఇల్లు ఉన్నదా అని చూసుకుంటారు. లేదా పేపర్లలో వచ్చే ప్రకటనలు చూస్తుంటారు. మరికొంత మంది బ్రోకర్ల ద్వారా ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. అయితే ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి మరొక ప్రత్యామ్నాయం కూడా ఉంది.
అదే వేలం. బ్యాంకులు చాలా మందికి ఇల్లు కొనుగోలు చేసేందుకు అప్పులు ఇస్తుంటాయి. కొంత మంది ఆర్ధిక సమస్యల వల్ల తమ రుణానికి సంబంధించిన నెలవారీ వాయిదాలను చెల్లించలేకపోతారు. ఇలాంటి సమయంలో బ్యాంకులు ఆయా వ్యక్తుల ఇళ్ల ను స్వాధీనం చేసుకొని వేలం నిర్వహిస్తాయి. ఈ వేలానికి సంబంధించి పత్రికల్లో ప్రకటన చేస్తాయి. అప్పుడు ఆ వేలంలో పాల్గొనడం ద్వారా ఇంటిని సొంతం చేసుకోవచ్చు.
యస్ బ్యాంక్ క్రైసిస్: మరిన్ని కథనాలు..

ప్రయోజనాలు
వేలంలో ఇల్లు కొంత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుంది. వేలంలో ఎక్కువ పోటీ లేకుంటే మీరు మంచి ధరకే ఇంటిని సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు వేలంలో సొంతం చేసుకునే ఇల్లు అన్నివిధాలుగా బాగుంటే మీకు సమస్య ఉండదు. లేకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి గురించి కూడా తెలుసుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోండి...

చెల్లించాల్సిన పన్నులు, బకాయిలు
రుణ చెల్లింపుదారు డిఫాల్ట్ అయినా సందర్భంలోనే ఇల్లు వేలందాకా వస్తుందన్న విషయం మరచి పోవద్దు. ఇలాంటి వారు ఆ ఇంటికి సంబందించిన స్థానిక పన్నులను, సొసైటీ చార్జీలు, ఇతర సౌకర్యాలకు సంబందించిన బిల్లులు కూడా ఎగవేయడానికి అవకాశం ఉంటుంది. వీటికి అవసరమైతే జరిమానాలు కూడా పడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ మొత్తం వేల రూపాయల్లో ఉండవచ్చు. అలాంటప్పుడు పెద్ద భారమే పడుతుంది. కాబట్టి ఇలాంటిని ఏమైనా ఉన్నాయో ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ భాద్యత కొత్త యజమాని మరచి పోవద్దు. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీల విషయంలో అయితే బిల్డర్ ను సంప్రదించడం మంచిది.

ముందే చూసుకోవడం మంచిది
ఇల్లు వేలందాకా వెళ్లిందంటే ఆ ఇంటికి అప్పటికి యజమాని అంతగా పట్టించుకునే అవకాశం ఉండదు. దాని నిర్వహణ అంత బాగా ఏమీ ఉండకపోవచ్చు. ఇంటి గోడలు బీటలు బారడం, బాత్రూముల నిర్వహణ బాగుండకపోవడం, ప్లంబింగ్ సమస్యలు తదితర సమస్యలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఆ ప్రాపర్టీ ఉన్న పరిసర ప్రాంతాలు ఏవిధంగా ఉన్నాయో కూడా చూసుకోవడం మంచిది.

బహుళ రుణాలు
బ్యాంకులు రుణం ఇచ్చే ముందు ప్రాపర్టీకి సంబందించిన అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రుణాన్ని మంజూరు చేస్తాయి. అయితే కొంత మంది మేధావులు తిమ్మిని బమ్మి చేసి ఒకే ప్రాపర్టీ పై వివిధ బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు. ఈ వివరాలు మీరు ముందుగానే తెలుసుకోకుంటే కొత్త యజమానిగా మారే మీకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే ఓనర్ షిప్ టైటిల్ డీడ్ ను లాయర్ ద్వారా చెక్ చేయించుకోవాలి.

రియల్టీ లాయర్
రియల్ ఎస్టేట్ లావాదేవీలపై అందరికీ అవగాహన ఉండదు. అనేక అంశాలు, ఇబ్బందులు ఎదురుకావచ్చు. కాబట్టి రియల్ ఎస్టేట్ లావాదేవీలపై ఎక్కువ అవగాహన ఉన్న లాయర్ల సలహాలు తీసుకోవడం మంచిది. ఇంటికోసం జీవిత కాలం సంపాదించిన మొత్తాన్ని వెచ్చిస్తారు. కాబట్టి ఇల్లును కొనుగోలు చేసే సమయం లో అన్ని సక్రమంగా ఉన్నది లేనిది చూసుకుంటే కంటి నిండా నిద్ర పోవచ్చు కదా.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications