క్రిస్మస్ కోసం ఫ్రీ కేక్ కావాలా ? అయితే లైక్ కొట్టు కేక్ పట్టు..
పండగలు, ఫెస్టివల్ సీజన్లలో కొన్ని కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు అలాగే మార్కెట్లో పోటీని అధిగమించేందుకు రకరకాల క్యాంపైన్లు, వెరైటీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తుంటాయి. కొద్దిరాజుల్లో ఈ ఏడాది ముగిసి కొత్త ఏడాది రాబోతుంది అయితే దీని కంటే ముందు అంటే రేపు క్రిస్మస్ సందర్బంగా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఓ వెరైటీ ప్లాన్ చేసింది. జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్ క్రిస్మస్ కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఏంటంటే మీకు ఫ్రీగా క్రిస్మస్ కేక్ లభిస్తుంది. Blinkit సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్ షేర్ చేసింది. అదేంటంటే రూ.499 కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన కస్టమర్లందరికి క్రిస్మస్ కేక్‌లను అందజేస్తామని, Xలో పోస్ట్ చేసిన పోస్ట్‌కు 5000 లైక్‌లు వస్తే సరిపోతుందని పేర్కొంది. బ్లింకిట్ X పోస్ట్‌లో "క్రిస్మస్ స్పెషల్.. ఈ ట్వీట్‌కి 5000 లైక్‌లు వస్తే రూ. 499 కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ కేక్ ఫ్రీగా లభిస్తుంది" అని కంపెనీ తెలిపింది.
బ్లింకిట్ ఆర్డర్‌లపై క్రిస్మస్ కేక్ ఫ్రీగా పొందడం ఎలా?
మీరు చేయాల్సిందల్లా కంపెనీ X పోస్ట్‌కి వెళ్లి లైక్ చేయండి. పోస్ట్‌కు 5000 లైక్‌లు వచ్చిన తర్వాత ఆర్డర్ కండిషన్ ప్రకారం ప్రతి ఒక్కరికీ ఉచిత క్రిస్మస్ కేక్ లభిస్తుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ పోస్ట్‌కి ఇప్పటికే ఏడు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. లైకులు మాత్రమే కాదు బ్లింకిట్ చేసిన పోస్ట్‌కి రకరాల కామెంట్‌లు కూడా వస్తున్నాయి. ఒక యూజర్ థియోప్రోమా నుండి 799 కేక్‌ను నాకు పంపండి అని పోస్ట్ చేయగా, మా ఏరియాలో మీ డెలివరీ సర్వీస్ లేదు మరి నాకు ఫ్రీగా కేక్ వస్తుందా? అని మరో యూజర్ అన్నారు. మరొక యూజర్ నాకు రమ్ కేక్ పంపండి అంటూ హాస్యంగా కామెంట్ చేస్తున్నారు. ఇంకొకరు అయితే swiggy, zeptoని ట్యాగ్ చేస్తూ మీ ప్లాన్స్ ఏంటి? అంటూ ప్రశ్నించారు. బ్లింకిట్ ఈ వెరైటీ మార్కెటింగ్ ప్రజలలో మంచి స్పందన తీసుకొచ్చింది. దీనితో పాటు Blinkit బ్రాండ్ అవగాహన కూడా పెరిగింది. రేపు క్రిస్మస్ పండుగ కావడంతో చాలా మంది ఈ పోస్ట్‌ను ఫ్రీ కేక్ కోసం లైక్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications