Disney News: ఎంతో కాలంగా మార్కెట్లో వినబడుతున్న ఓ వార్తకు సంబంధించి తాజాగా అప్‌డేట్ వచ్చింది. మీడియా రంగంలో రిలయన్స్‌తో ఓ ప్రఖ్యాత కంపెనీ జతకట్టేందుకు ముందడుగు పడింది. ఈ మేరకు అతి త్వరలో ఇన్వెస్టర్లకు శుభవార్త వినేందుకు ఆ సంస్థలు రెడీ అవుతున్నాయి.
వాల్ట్ డిస్నీ కో. మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారత్‌లో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేయడానికి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలోని భారీ మార్కెట్‌పై యుఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం కన్నేసింది. దీంతో ఇండియాలోని అతిపెద్ద కంపెనీతో కలిసి మీడియా రంగంలో వండర్స్ సృష్టించేందుకు ప్లాన్ చేసింది.

ఈ జాయింట్ వెంచర్‌లో రిలయన్స్ మీడియా యూనిట్ సహా దాని అనుబంధ సంస్థలు 61 శాతం వాటా కలిగి ఉంటాయని భావిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని డిస్నీ హోల్డ్ చేయనున్నట్లు సమాచారం. ఈ వారం ప్రారంభంలో ఇరు కంపెనీలు పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రశ్నలపై స్పందించేందుకు రెండు సంస్థలూ నిరాకరించాయి.
ఇదే సమయంలో టాటా ప్లే లిమిటెడ్‌లో డిస్నీ మైనారిటీ వాటాను కలిగి ఉన్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. దీనిని రిలయన్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. డిస్నీ తన సబ్‌స్క్రైబర్‌లను నిలబెట్టుకోవడం సహా మీడియా ఆస్తులను భద్రపరచుకోవడం వంటి సవాళ్లను అధిగమించేందుకు భారత్‌లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications