Toys: భారతదేశం నుంచి తన ఎగుమతులను ఏటా 10 బిలియన్ డాలర్ల మేరకు పెంచాలని వాల్ మార్ట్ నిర్ణయించుకుంది. 2027 నాటికి దీనిని సాధించాలని US బేస్డ్ రిటైల్ దిగ్గజం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియన్ సప్లయర్స్ నుంచి బొమ్మలు, షూస్, సైకిళ్లను అధికంగా ఎక్స్ పోర్ట్ చేయాలని చూస్తోంది.
ఆహారం, ఫార్మాస్యూటికల్స్, వినియోగ వస్తువులు, ఆరోగ్యం, దుస్తులు వంటి విభాగాల్లోకి కొత్త సరఫరాదారులను తీసుకురావాలని అనుకుంటున్నట్లు వాల్ మార్ట్ ప్రతినిధి తెలియజేశారు. ఇందులో భాగంగా కంపెనీ ప్రధాన కార్యాలయం అధికారులు దేశీయ బొమ్మల తయారీదారులతో వర్చువల్ సమావేశాన్ని సైతం ఇటీవల నిర్వహించారు.

నేరుగా మాన్యుఫ్యాక్చరర్స్ తో సంబంధాలు కుదుర్చుకోవాలని కంపెనీ భావిస్తున్నందున.. వారి అవసరాలు, ఆశిస్తున్న నాణ్యతా ప్రమాణాల గురించి దేశీయ వ్యాపారులకు కంపెనీ తెలియజేసింది. IKEA వంటి గ్లోబల్ రిటైలర్లు తమ అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఇప్పటికే ఇండియా నుంచి బొమ్మలను సోర్సింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాల్ మార్ట్ వంటి పెద్ద సంస్థ దేశీయ టాయ్స్ మార్కెట్ వైపు చూడటం హర్షించదగ్గ విషయం.
కొన్నేళ్ల క్రితం వరకు భారత్ ఓ బొమ్మల దిగుమతిదారు. కానీ ఇటీవల దేశంలో జరిగిన మార్పుల కారణంగా పరిస్థితి తలకిందులైంది. IKEA, వాల్ మార్ట్ వంటి సంస్థలు టాయ్స్ విషయంలో ఇండియా వైపు చూడటం.. బొమ్మల పరిశ్రమలో పెరుగుతున్న భారత్ ప్రాబల్యాన్ని హైలైట్ చేస్తోంది. ఇందుకోసం స్థానికంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(MSME)లకు గణనీయమైన ప్రోత్సాహాన్ని సైతం కంపెనీ అందిస్తుంది.

2022-23 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో బొమ్మల ఎగుమతులు రూ.1,017 కోట్లు. 2021-22లో వీటి విలువ రూ.2,601 కోట్లు. దాదాపు గత పదేళ్ల క్రితం 2013-14 ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎగుమతులు కేవలం రూ.167 కోట్లు మాత్రమే. ఇక 2021-22లో బొమ్మల మొత్తం దిగుమతి 70 శాతం తగ్గి రూ.870 కోట్లకు పడిపోయింది. టాయ్స్ ఇంపోర్ట్స్ తగ్గించాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 2020లో బొమ్మలపై దిగుమతి సుంకం 20 శాతం నుంచి 60 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాది దానికి మరో 10 శాతం జోడించారు.


Click it and Unblock the Notifications