Elon Musk New: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ఓ సంచలనం విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్‌గా మారింది. తన కంపెనీలు సహా చట్టపరమైన నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానికి ప్రవర్తిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.
స్నేహితులు, కంపెనీల డైరెక్టర్లు, వ్యాపార సహచరులను ఎలాన్ మస్క్ తనతో పాటు డ్రగ్స్ సేవించేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రముఖ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. ఆయనతో సన్నిహితంగా ఉండేందుకు పలు నిషేధిత పదార్థాలను వినియోగించాల్సి ఉంటుందంటూ బాంబ్ పేల్చింది.

మస్క్ నిర్వహించే వివిధ పార్టీలలో కెటామైన్ తరహా డ్రగ్స్ తీసుకోవడం పరిపాటేనని తెలిపింది. వీటిని ఉపయోగించిన ప్రముఖుల్లో టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ కు సంబంధించిన ప్రస్తుత మరియు మాజీ డైరెక్టర్లు, బోర్డు సభ్యులు ఉన్నట్లు వెల్లడించింది. వారు మస్క్ కంపెనీలలో మిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.
వీరిలో వెంచర్ క్యాపిటలిస్టులు గ్రాసియాస్ మరియు ఇరా ఎహ్రెన్‌ప్రీస్, టెక్ మొగల్ లారీ ఎల్లిసన్, మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ జేమ్స్ మర్డోచ్ మరియు మస్క్ సోదరుడు కింబాల్ మస్క్ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నట్లు వివరించింది. 'మస్క్ ఇటీవల కాలంలో టెస్లా బోర్డు సభ్యులు, ఎయిర్‌బిఎన్‌బి సహ వ్యవస్థాపకుకలు జో గెబ్బియాతో కలిసి పలు సామాజిక సమావేశాలకు హాజరయ్యారు. అక్కడ ఆయన కెటామైన్‌ను నాసల్ స్ప్రే బాటిల్ ద్వారా అనేకసార్లు తీసుకున్నారు' అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
'కింబాల్ మస్క్‌తో సహా ఆయన సన్నిహితులు కొందరు హోటల్ ఎల్ గాంజోలో పార్టీలకు హాజరవుతారు. మెక్సికోలోని ఈ హోటల్ సంగీత ప్రదర్శనలతో పాటు డ్రగ్స్ సప్లైకు ప్రసిద్ధి చెందింది. ఒకవేళ డ్రగ్స్‌ని తిరస్కరించి బిలియనీర్‌ను కలవరపెడితే తమ సామాజిక హోదాను, సంపదను కోల్పోతామని వ్యాపార సహచరులు భయపడుతున్నారు' అని మీడియా సంస్థ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications