For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుప్పకూలిన అమెరికా మార్కెట్లు, ఎందుకంటే: గూగుల్, ఫేస్‌బుక్ డౌన్

|

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం, ఆర్థిక ప్యాకేజీపై అనిశ్చితి నేపథ్యంలో అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. అమెరికాలోను మృతుల రేషియో పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకేజీపై అనిశ్చితి తోడవడంతో స్టాక్స్ కుప్పకూలాయి. డౌజోన్స్ 650 పాయింట్లు (2.29 శాతం), ఎస్ అండ్ పీ 65 పాయింట్లు (1.86 శాతం), నాస్‌డాక్ 189 పాయింట్లు(1.64 శాతం) క్షీణించాయి.

ముఖేష్ అంబానీXజెఫ్ బెజోస్: రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!!ముఖేష్ అంబానీXజెఫ్ బెజోస్: రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!!

ఇన్వెస్టర్లలో ఆందోళన

ఇన్వెస్టర్లలో ఆందోళన

కరోనా కేసులు తిరిగి రికార్డ్‌స్థాయిలో పెరుగుతుండటంతో సోమవారం అమెరికా మార్కెట్లకు షాకిచ్చింది. ఎన్నికలకు ముందు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉండే సహాయక ప్యాకేజీపై అనిశ్చితి ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచింది. నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్యాకేజీ కంటే ఇది అధికం కాగా, కొన్ని రాష్ట్రాలు, వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ట్రంప్ గతంలో ఆరోపించారు. ఈ ప్యాకేజీపై రిపబ్లికన్లు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ భారీ ఆర్థిక ప్యాకేజీకి సిద్ధమని ట్రంప్ తెలిపారు. కానీ ఆర్థిక మంత్రితో నిర్వహిస్తున్న చర్చలు సాగుతున్నాయి. ఇది సెంటిమెంటును దెబ్బతీసింది. పైగా కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు ఢీలా

ఆసియా మార్కెట్లు ఢీలా

అంతర్జాతీయ మార్కెట్లో భారీ నష్టాల్లో ముగియడంతో ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. జపాన్ నిక్కీ 0.03 శాతం, సౌత్ కొరియా కోప్సీ 0.55 శాతం, తైవాన్ వై9999 0.26 శాతం, ఇండోనేషియా జాకిడిక్స్ 0.30 శాతం, ఆస్ట్రేలియా స్టాక్స్ 1.69 శాతం మేర నష్టపోయాయి. హాంగ్‌కాంగ్, మలేషియా మార్కెట్లకు ఈ రోజు సెలవు దినం. అయితే షెన్‌జెన్, షాంఘై కాంపోసిట్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. భారత మార్కెట్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంలో ఉంది.

టెక్ దిగ్గజాలు డీలా

టెక్ దిగ్గజాలు డీలా

ఆపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ తదితర టెక్ దిగ్గజాలు సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. సోమవారం ప్రధానంగా ట్రావెల్ స్టాక్స్ క్షీణించాయి. ఎయిర్ లైన్స్ స్టాక్స్ 3.5 శాతం నుండి 7 శాతం మధ్య పతనమయ్యాయి. కరోనా ప్రభావం అంచనాల కంటే ఎక్కువ కాలం ఉండవచ్చుననే వార్తలు ఆందోళనను కలిగిస్తున్నాయి. రికవరీ ఆలస్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒరాకిల్ స్టాక్స్ నాలుగు శాతం మేర క్షీణించాయి. గూగుల్, ఫేస్‌బుక్ స్టాక్స్ కూడా దాదాపు 3 శాతం మేర నష్టపోయాయి. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం లాభపడింది.

English summary

కుప్పకూలిన అమెరికా మార్కెట్లు, ఎందుకంటే: గూగుల్, ఫేస్‌బుక్ డౌన్ | Wall Street closes down on soaring virus cases, US stimulus worries

The Dow was off its lows in afternoon trading but still closed down about 2.3%, as investors sold cyclical stocks, the type that would do well in an economic rebound.
Story first published: Tuesday, October 27, 2020, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X