Gold News: 2025లో పసిడి ఇన్వెస్టర్లకు మంచి సమయమే.. సీక్రెట్ చెప్పిన వాల్‌స్ట్రీట్.. పూర్తి వివరాలివే..
Gold Rates 2025: వాస్తవానికి 2024లో పసిడిపై పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు నిజంగా గోల్డెన్ డేస్ చూశారు. ఈక్విటీ మార్కెట్లకు ఏమాత్రం తగ్గకుండా గోల్డ్ ఈ ఏడాది రాబడులను అందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అస్థిర ఆర్థిక పరిస్థితులతో పాటు పెరిగిన భౌగోళిక రాజకీయ పరిస్థితులతో సేఫ్ హెవెన్ గోల్డ్ రేట్లు భారీగా పెరగటంతో పెట్టుబడిదారులు మంచి రాబడులను అందుకున్న సంగతి తెలిసిందే.
2010 తర్వాత పసిడి మంచి రాబడులను అందించిన ఏడాదిగా 2024 నిలిచింది. వాస్తవానికి ఈ ఏడాది రిటైల్ కొనుగోలుదారులు భారీగా ఆందోళనకు గురైనప్పటికీ పసిడి ధరల పెరుగుదల ఇన్వెస్టర్లను మాత్రం సంతోషంలో ముంచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రముఖ వార్తా సంస్థ వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజా ప్రకటన ప్రకారం రానున్న 2025లో గోల్డ్ రేట్లు మరింతగా పెరగనున్నాయని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద బ్యాంకులు రానున్న ఏడాది గోల్డ్ రేటు ఔన్సుకు 3,000 డాలర్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నాయి.

విలువైన మెటల్ పసిడి ధరలు 2024లో 27% పెరిగి ట్రాయ్ ఔన్స్‌కి 2,617.20 డాలర్లకి చేరాయి. ఇది S&P 500 అందించిన 25% లాభం కంటే మెరుగైన రాబడులను అందించింది. రానున్న సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ రేటు తగ్గింపులు, సురక్షిత మెటల్ లో పెరుగుతున్న పెట్టుబడులు బంగారం, వెండి ధరలకు మద్దతునిచ్చాయి. అయితే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపడుతూ అమెరికా అనుకూల విధానాలు ఇతర లోహాలపై ఒత్తిడి తెచ్చాయి. ఈ పరిస్థితులు రానున్న సంవత్సరంలో పసిడి ధరలను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా బ్యాంకింగ్ దిగ్గజాలు 2025లో పసిడి ధర ఔన్సుకు గరిష్ఠంగా 3200 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసిన నేపథ్యంలో చాలా మంది గోల్డ్ ఇన్వెస్టర్లు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అందువల్ల పెట్టుబడిదారులు గోల్డ్ రేట్లు తగ్గిన ప్రతి డిప్ లోనూ కొనుగోలుకు అవకాశంగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారు గోల్డ్ రేట్లు తగ్గినప్పుడల్లా కొత్త పెట్టుబడులను కొనసాగించవచ్చని వారు సూచిస్తున్నారు.
నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు..
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7135గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7784 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7135గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7784 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.99,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications