తాజా సర్వేలో బయటపడ్డ విషయం ఏమిటంటే, అమెరికాలో చదవడానికి వచ్చే విదేశీ విద్యార్థులలో సగానికి పైగా మంది, H-1B వీసాలను వేతనాల ఆధారంగా ఇస్తే, మొదట్లోనే అమెరికాకు రాకపోయేవారని ఒక తాజా సర్వే చెబుతోంది.
"ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్" మరియు NAFSA సంస్థలు కలిసి చేసిన సర్వేలో 1,039 మంది F-1, J-1 వీసా విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 53% మంది ఏం చెప్పారంటే H-1B వీసాలు వేతనాల ఆధారంగా ఉంటే, వారు అమెరికాకు అసల రాకపోవచ్చు అని అన్నారు. ఈ ఫలితాలు అమెరికాలో చదువుకోవడం కోసం వచ్చే విద్యార్థులు ఎక్కువ చదువుకునే డిగ్రీ కన్నా చదువు తర్వాత వచ్చే H-1B ఉద్యోగ అవకాశాలు చాలా ముఖ్యమని. కానీ, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న H-1B మార్పులు వస్తే అమెరికా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను కోల్పోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న విద్యార్థుల్లో సగానికి పైగా చదువు ముగిసిన తర్వాత అమెరికాలోనే ఉండాలని భావిస్తున్నారు. సర్వే ప్రకారం 36% మంది చదువు ముగిసిన తర్వాత ఖచ్చితంగా అమెరికాలోనే ఉండాలని భావిస్తున్నారు. 28% మంది చదువు తర్వాత, చాలా అవకాశాలు ఉంటే, అమెరికాలో ఉండే అవకాశం ఉందని చెప్పారు.
కానీ H-1B వీసాలు వేతనాల ప్రాధాన్యత మీద ఇవ్వబడితే?
చాలా మంది తమ ప్లాన్‌లను మార్చేస్తారు. మాస్టర్స్ పూర్తైన విద్యార్థుల్లో 48% మంది ఇక అమెరికాలో ఉండమని చెప్పారు. PhD విద్యార్థుల్లో 52% మంది తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పోస్ట్ డాక్టరేట్ పరిశోధకుల్లో 38% మంది ఇక ఇక్కడ ఉండేందుకు ప్రయత్నించమని చెప్పారు. అంటే స్పష్టంగా చెప్పాలంటే వేతనాల ఆధారంగా H-1B కేటాయిస్తే, అమెరికాలో చదివిన టాప్ టాలెంట్ కూడా తిరిగి వెళ్లే అవకాశం పెరుగుతుంది.
కంపెనీలు కూడా విద్యార్థుల పైనే ఆధారపడుతున్నాయి. 75 మంది అమెరికన్ ఉద్యోగల పై చేసిన మరో సర్వేలో కూడా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. "క్యాప్-సబ్జెక్ట్ కంపెనీలలో 63%" సంస్థలు తమ మొదటి H-1B పిటిషన్లలో కనీసం సగం, అమెరికా యూనివర్సిటీల్లో చదివిన విదేశీ విద్యార్థుల కోసమే దాఖలు చేస్తున్నాయి. "క్యాప్-ఎగ్జెంప్ట్ సంస్థల్లో యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు కూడా ఇలా ఆధారపడటం 56% మంది ఉన్నారు. ఇంకా ఆశ్చర్యమేమిటంటే వీటిలో చాలా పిటిషన్లు సర్వేలో భాగంగా, క్యాప్-సబ్జెక్ట్ సంస్థల్లో దాఖలైన H-1B పిటిషన్లలో కనీసం 46% మంది కేసులు ప్రారంభ స్థాయి వేతనాల కిందనే దాఖలు చేస్తున్నట్లు తేలింది. అదే విధంగా, అమెరికాలో అడ్వాన్స్‌డ్ డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థుల కోసం దాఖలు చేసిన పిటిషన్లలో కూడా 41% మంది Level 1 వేతనాల కిందే ఫైల్ చేస్తున్నారు. ఈ ఫలితాలు సూచిస్తున్నది ఏమిటంటే చాలా ఉద్యోగదారులు అమెరికాలో చదివిన అంతర్జాతీయ విద్యార్థుల పై వేతనాలను ఎక్కువ పెంచకుండా ఎక్కువగా ప్రారంభ స్థాయి జీతాలతోనే ఆధారపడుతున్నారు.
బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీకోసం.. అధిక వడ్డీ రేటుతో..
భవిష్యత్తులో అమెరికాకు చదువుకోడానికి రావాలనుకునే విద్యార్థులలో కూడా H-1B వీసాలను వేతనాల ఆధారంగా ఇస్తే సానుకూలంగా ప్రభావం చూపించదు అని తేలింది. 611 మంది భవిష్యత్తు విద్యార్థుల పై చేసిన సర్వేలో, ఇలాంటి విధానం వల్ల 6% మంది మాత్రమే అమెరికా విద్యాసంస్థల్లో చేరతారని చెప్పారు. ముఖ్యంగా బ్యాచిలర్స్ మరియు మాస్టర్స్ స్థాయి విద్యార్థుల పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. సుమారు 7% మంది ఇక అమెరికాకు రావలసిన అవసరం లేదు అని భావిస్తున్నారు. కాబట్టి, PhD విద్యార్థుల పై ఈ ప్రభావం తక్కువగా ఉంది. సుమారు 2% మంది మాత్రమే తమ ప్రణాళికలను మార్చాల్సి వస్తుందని చెప్పారు. ఈ ఫలితాలు ప్రకారం H-1B వేతన మార్పులు భవిష్యత్తులో అమెరికాకు రాబోయే ప్రతిభావంతులైన విద్యార్థుల సంఖ్యను తగ్గించవచ్చు.
ఈ సర్వేలో పాల్గొన్న విద్యార్థులలో ఎక్కువ మంది STEM రంగాలతో సంబంధం ఉన్నవారు. మొత్తం 1,039 మందిలో, 49% మంది PhD విద్యార్థులు మరియు 26% మంది పోస్ట్‌డాక్టరేట్ రీసెర్చర్లు ఉన్నారు. ఫీల్డ్ ప్రకారం గమనిస్తే, 35% మంది ఫిజికల్ లేదా నేచురల్ సైన్సెస్, 19% మంది బయోలాజికల్ మరియు బయోమెడికల్ సైన్సెస్ మరియు 16% మంది ఇంజినీరింగ్ ఫీల్డ్స్కి చెందినవారని సర్వేలో వెల్లడైంది. వర్సిటీ రకాన్ని బట్టి చూస్తే, వీరిలో 73% మంది పబ్లిక్ యూనివర్సిటీల్లో, 27% మంది ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుతున్నారు. అంటే, STEM రంగాల్లో ఎక్కువ మంది ముఖ్యంగా పెద్ద పబ్లిక్ విశ్వవిద్యాలయాల నుండి అమెరికాకు చదువుకోడానికి వస్తున్నారు.
మొత్తం మీద H-1B వీసాలను వేతనాల ఆధారంగా ఇవ్వడం అనేది అమెరికాకు విదేశీ టాలెంట్‌ని ఆకర్షించడం, నిలుపుకోవడం రెండింటి పైనా సీరియస్ ప్రభావం చూపే నిర్ణయం అవుతుంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, దేశానికి అవసరమైన "STEM రంగాల్లో ఉన్న మేధావులు వెనక్కి వెళ్లిపోవడం", అమెరికా పరిశోధన-ఆవిష్కరణ రంగాలకు ఒక పెద్ద మైనస్ అవుతుంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications