Go First Case: నిధుల కొరతతో దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత దేశీయ విమానయాన సంస్థ గోఫస్ట్ నేలకూలింది. 2023 మార్చి 2న కంపెనీ తన విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన కంపెనీకి తాజాగా కోర్టు నుంచి కూడా ప్రతికూల తీర్పు రావటం షాక్‌కి గురిచేస్తోంది.
వాడియా గ్రూప్ నిర్వహణలోని విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు దిల్లీ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. వాస్తవానికి విదేశీ కంపెనీల నుంచి విమానయాన సంస్థ అద్దెకు తీసుకున్న విమానాల రిజిస్ట్రేషన్‌ను 5 రోజుల్లోగా డీరెజిస్టర్ చేయాలని సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ డైరెక్టర్ జనరల్‌ని కోర్టు ఆదేశించింది. దీంతో సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ నుంచి లీజుదారులకు చెందిన 54 విమానాల రిజిస్ట్రేషన్ రద్దు కోసం చేసిన దరఖాస్తులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెంటనే ప్రాసెస్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో వెల్లడించింది.

ఎయిర్‌లైన్‌ను నిర్వహించడానికి దివాలా చట్టం కింద నియమించబడిన రిజల్యూషన్ ప్రొఫెషనల్, దాని డైరెక్టర్‌లను విమానాలు లేదా విడిభాగాలు, పత్రాలు, రికార్డులతో పాటు ఇతర వస్తువులను తరలించడం లేదా తీసుకెళ్లడం నుంచి జస్టిస్ తారా వితస్తా గంజు నిషేధించారు. వాస్తవానికి గత ఏడాది మే నెలలో విదేశీ కంపెనీలు విమానయాన సంస్థలకు అద్దెకు ఇచ్చిన తమ విమానాలను వెనక్కి తీసుకోవాలని డీజీసీఏని సంప్రదించగా నికారకించటంతో వారు దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అయితే హోల్డ్ కారణంగా విమానాలను విడుదల చేయలేమని తొలుత డీజీసీఏ తెలిపింది. దీని తర్వాత డీజీసీఏ కోర్టు నిర్ణయం కోసం వేచి ఉంది. గో ఫస్ట్‌కి అద్దెకు విమానాలను అందించే వాటిలో దుబాయ్ ఏరోస్పేస్ ఎంటర్‌ప్రైజెస్ క్యాపిటల్, ACG ఎయిర్‌క్రాఫ్ట్ వంటి కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గోఫస్ట్ విమానయాన కంపెనీ కేసులో స్టే ఆర్టర్ పొందలేకపోతే విమానాలను లీజుకు ఇచ్చిన విదేశీ కంపెనీలకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే జరిగితే కంపెనీ తన ఫ్లీట్ నుంచి 54 విమానాలను కోల్పోతుంది. రానున్న 5 రోజుల్లో వీటి డీరిజిస్ట్రేషన్ ప్రక్రియ మెుదలుకానుంది. ఆదేశాలను వారం రోజులు స్టేలో ఉంచాలని గోఫస్ట్ సంస్థ తరఫున న్యాయవాది కోరినప్పటికీ అందుకు ధర్మాసనం నిరాకరించింది.


Click it and Unblock the Notifications