Waaree Renewables: దేశంలో ఎనర్జీ రంగంలోని కంపెనీల షేర్లు భారీ ర్యాలీని చూస్తున్నాయి. ఒకప్పటి పెన్నీ స్టాక్స్ గా ఉన్న కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తూ డబ్బు వర్షం కురిపిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సోలార్ సిస్టమ్ తయరీ ఇన్‌స్టాలేషన్ వ్యాపారంలో ఉన్న వారీ రెన్యూవబల్ టెక్నాలజీస్ కంపెనీ గురించే. కేవలం ఐదేళ్లలో కంపెనీ తన పెట్టుబడిదారులను ఏకంగా కోటీశ్వరులుగా మార్చేసింది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు 61,804 శాతం రాబడిని అందుకున్నారు. జూన్ 28, 2019లో కంపెనీ షేర్ ధర ఒక్కోటి కేవలం రూ.3.15 వద్ద ఉండగా ప్రస్తుత మార్కెట్ ధర ఒక్కో షేరుకు దాదాపు రూ.1,950 వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలో 2019లో కంపెనీ షేర్లలో కేవలం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించిన ఇన్వెస్టర్లు కోటీశ్వరులుగా మారారు. వారి లక్ష రూపాయల పెట్టుబడి విలువ రూ.6 కోట్లకు చేరుకుంది.

వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ కేవలం ఏడాది కాలంలో 769% కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ క్రమంలో లక్ష రూపాయల ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువ రూ.7.70 లక్షలకు చేరుకుంది. అలాగే గడచిన ఆరునెలల కాలాన్ని పరిశీలిస్తే ఇన్వెస్టర్లకు కంపెనీ షేర్లు 342 శాతం రాబడిని అందించింది. నేడు కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ఉదయం రూ.2,024 రేటు వద్ద ప్రారంభమయ్యాయి. అయితే మార్కెట్ల ముగింపు సమయంలో స్టాక్ ధర బీఎస్ఈలో రూ.1,958 వద్ద ట్రేడింగ్ ముగించింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.20,392 కోట్లకు చేరుకుంది.
ఈరోజు ఈ స్టాక్ రూ.2024 వద్ద ప్రారంభమై రూ.2030కి చేరింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.3037.75గా ఉండగా.. స్టాక్ కనిష్ఠ ధర రూ.213.01 వద్ద ఉంది. కంపెనీ తన 32 సంవత్సరాల అనుభవంతో టైర్-1 సోలార్ మాడ్యూల్ తయారీదారుగా గుర్తింపును పొందింది. ఇప్పటి వరకు కంపెనీ మెుత్తం 1.5 గిగా వాట్స్ కంటే ఎక్కువ ప్రాజెక్టులను పూర్తి చేసింది. అలాగే సంవత్సరానికి 22% CAGR వృద్ధిని సాధించింది. రానున్న కాలంలో సైతం ఎనర్జీ స్టాక్స్ బూమ్ కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications