Worst Stock: ఇన్వెస్టర్ల జీవితాన్ని తలకిందులు చేసిన స్టాక్.. 9 నెలల్లో 70 శాతం పతనం, జాగ్రత్త..

Waaree Renewables: ఓడలు బండ్లు అవ్వటం అంటే ఇదేనేమో. స్టాక్ మార్కెట్ల ప్రస్తుత ఒడిదొడుకుల ప్రయాణంలో కొన్ని స్టాక్స్ భారీ పతనాలను చూస్తున్నాయి. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ల పనితీరు రోజురోజుకూ దిగజారుతోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి చెందిన వారీ రెన్యూవబుల్ లిమిటెడ్ స్టాక్ గురించే. గడచిన సంవత్సరంలో కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు ఉత్తమ పనితీరుతో మల్టీబ్యాగర్ రాబడులను అందించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్కెట్ల అస్థిరతల్లో ఈ రెన్యూవబుల్ స్టాక్ కూడా క్షీణతను చూస్తోంది. ఏడాది కిందట జనవరిలో రూ.396 వద్ద ఉన్న కంపెనీ షేర్ల ధర ఆ తర్వాత త్రైమాసిక కాలంలో మెగా ర్యాలీతో రూ.3038 స్థాయిలకు చేరుకుంది. వాస్తవానికి ఇది స్టాక్ జీవితకాల గరిష్ఠ ధర. ప్రస్తుతం కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు నష్టాలతో ఆవేదన చెందుతున్నారు.

Waaree Renewables Stock fell 70Percent in just 9 months from 3038 to 890 Know reasons behind

అయితే ఆ తర్వాతి నుంచి కంపెనీ షేర్లలో పతనం కొనసాగింది. నేడు ఇంట్రాడేలో ఉదయం 9.31 గంటల సమయంలో కంపెనీ షేర్ల ధర దాదాపు రూ.890 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇది కంపెనీ 52 వారాల కనిష్ఠ ధర రూ.720 కంటే కొంచెం ఎక్కువ కావటం గమనార్హం. అంటే గడచిన 9 నెలల కాలంలో కంపెనీ షేర్ల ధర దాదాపు 70 శాతానికి పైగా క్షీణతను చూసింది. కంపెనీ షేర్ల పతనానికి పనితీరే కారణమని నిపుణులు చెబుతున్నారు. బ్రోకరేజ్ సంస్థలు కూడా దీనికి తగినట్లుగానే తమ రేటింగ్స్ అప్గ్రేడ్ చేయటంతో పాటు టార్గెట్ ధరలను తగ్గిస్తున్నాయి.

ట్రంప్ నిర్ణయాలు..
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంపై కీలక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ట్రంప్ అధికారంలోకి రావటంతో రెన్యువబుల్ ఎనర్జీ రంగంలోని అనేక కంపెనీల షేర్లు ప్రతికూలంగా ప్రభావితం అయిన సంగతి తెలిసిందే. అలాగే చాలా కంపెనీల ఎగుమతి వ్యాపారం కూడా ప్రస్తుతం దెబ్బతిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని టాప్ సోలార్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న వారీ స్టాక్ కూడా ప్రభావితం అయ్యిందని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+