Multibagger Stock: రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలోని కంపెనీలదే రానున్న కాలంలో హవా. ఇప్పటికే ఈ రంగాల్లో ఉన్న కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్నాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ల గురించే. ఒకప్పుడు కేవలం రూ.8 వద్ద ఉన్న స్టాక్ ధర ప్రస్తుతం 13000 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. మూడేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించి వారికి కంపెనీ స్టాక్ కోటీశ్వరులుగా మార్చింది.

వారీ కంపెనీ షేర్ ధర జూలై 3, 2020న రూ.8.22 వద్ద ఉన్నాయి. సోలార్ ప్యానెల్స్ తయారీలో ప్రసిద్ధి చెందిన స్టాక్ ధర నేడు మార్కెట్లో రూ.1,141 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. 2023లో ఇప్పటి వరకు స్టాక్ 127 శాతం రాబడిని అందించింది. అలాగే గడచిన ఐదేళ్ల కాలంలో స్టాక్ ఏకంగా 4,800 శాతం రిటర్న్ ఇచ్చింది. ఎవరైనా ఇన్వెస్టర్ మూడేళ్ల కిందట షేర్ ధర రూ.8.22 వద్ద ఉన్నప్పుడు లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టినట్లయితే ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం దాని విలువ రూ.1.38 కోట్లకు చేరుకుని ఉండేది.
స్టాక్ జూన్ 28, 2023న రికార్డు గరిష్ఠ స్థాయి రూ.1,174.50ని తాకగా.. జూలై 29, 2022న రూ.290.10 వద్ద 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,360 కోట్లుగా ఉంది. మార్చి 2022 త్రైమాసికంలో రూ.8 కోట్లుగా ఉన్న నికర లాభం మార్చి 2023 త్రైమాసికంలో దాదాపు రెండింతలు పెరిగి రూ.15.6 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ.21.1 కోట్లకు పెరిగింది.

Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications