VVIP Infratech IPO: మార్కెట్ల గమనంతో సంబంధం లేకుండా ఐపీవోలు వరుసగా లిస్టింగ్ అవుతూ గతంలో ఇన్వెస్టర్లు ఎన్నడూ చూడని స్థాయిలో లాభాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో బెట్టింగ్ వేస్తున్న ఇన్వెస్టర్లు సైతం భారీ రాబడులను తొలిరోజే చూస్తున్నాయి. ఇది కొత్త పెట్టుబడులను మార్కెట్లలోకి ఆకర్షిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లో జాబితా అయిన వీవీఐపీ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ ఐపీవో గురించే. బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో అడుగుపెట్టిన కంపెనీ షేర్లు అద్భుతమైన లిస్టింగ్ నమోదు చేసింది. దీంతో తొలిరోజు మార్కెట్లోకి కంపెనీ షేర్లు 90 శాతం ప్రీమియం ధర వద్ద జాబితా అయ్యాయి. వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఒక్కో షేరును రూ.93కి విక్రయించగా భారీ లాభంతో రూ.176.70 వద్ద జాబితా అయ్యాయి. అలాగే లిస్టింగ్ తర్వాత స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఇంట్రాడేలో గరిష్ఠమైన రూ.185.53ని చేరుకుంది. దీంతో తొలిరోజునే పెట్టుబడిదారులు దాదాపు 100 శాతం లాభాన్ని తమ బెట్టింగ్ పై అందుకున్నారు.

వివిఐపీ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ సాధారణ ఇన్వెస్టర్ల కోసం జూలై 23న ప్రారంభించబడి జూలై 25న ముగిసింది. ఈ క్రమంలో ఆఖరి రోజున ఐపీవో 236.92 రెట్లు బిడ్లను వాస్తవ ఇష్యూ సంఖ్య కంటే అధికంగా అందుకుంది. అలాగే ప్రైస్ బ్యాండ్ ధరను రూ.91-93గా నిర్ణయించింది. కంపెనీ ఐపీవోలో ఒక లాట్ కొనుగోలుకు పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించింది. తాజా ఐపీవో ద్వారా VVIP ఇన్‌ఫ్రాటెక్ మార్కెట్ల నుంచి రూ.61.21 కోట్లను సమీకరించింది. ఇందుకోసం 6,582,000 పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను ఐపీవోలో విక్రయించింది. ఐపీవో ద్వారా రైజ్ చేసిన డబ్బును కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఫైనాన్స్ క్యాపిటల్ ఖర్చులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలను తీర్చడానికి వినియోగించనుంది.
VVIP ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల ప్రణాళిక, అభివృద్ధి నిర్మాణంలో చురుకుగా ఉంది. ప్రధానంగా నీటి ట్యాంకులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, సెక్టార్ డెవలప్‌మెంట్, జల్ జీవన్ మిషన్ పనులు, విద్యుత్ పంపిణీ, 33 కెవిఎ వరకు సబ్‌స్టేషన్ల నిర్మాణం వంటి పనుల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. అలాగే కంపెనీ 2013లో కంపెనీ సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ (SBR) సాంకేతికతను ఉపయోగించి రెండు 56 MLD STPలను నిర్మించింది. ప్రస్తుతం వైభవ్ త్యాగి, విభోర్ త్యాగి, ప్రవీణ్ త్యాగి కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నారు.


Click it and Unblock the Notifications