వల్చర్ ఏఐ సూపర్ క్లస్టర్: చెన్నైలో దిగిపోయింది! భారత్ AI భవిష్యత్తు మారబోతోంది.

టెక్ ప్రపంచంలో నెక్స్ట్ బిగ్ థింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే, ఏఐకి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ కీలక తరుణంలో, అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ 'వల్చర్' (Vultr) చెన్నైలో భారీ ఏఐ సూపర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

ఇప్పటికే మన దేశంలో అంబానీ, అదానీ, టాటా వంటి దిగ్గజ సంస్థలు ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో, అమెరికా బయట తమ అతిపెద్ద డేటా సెంటర్‌ను చెన్నైలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వల్చర్ బరిలోకి దిగింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా, చెన్నైలో 20 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ సూపర్ క్లస్టర్‌ను నిర్మించనున్నారు. ఈ డేటా సెంటర్‌లో ఏకంగా 10,000 ఏఎండీ (AMD) ఇన్‌స్టింక్ట్ MI355X జీపీయూలను ఏర్పాటు చేయబోతున్నారు. దీనివల్ల భారీ స్థాయిలో ఏఐ ట్రైనింగ్, ఇంటర్‌ఫేస్ వర్క్‌లోడ్స్‌ను ఇది హ్యాండిల్ చేయగలదు.

AI

ఈ కొత్త ఏఐ సూపర్ క్లస్టర్ కోసం ఎంత పెట్టుబడి పెడుతున్నారో కంపెనీ వెల్లడించలేదు. కానీ, దీనివల్ల ఏఐ స్టార్టప్‌లు, డెవలపర్లు, ఇతర వ్యాపారాలకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని వల్చర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కెవిన్ కోక్రాన్ తెలిపారు.

ఏఐ టెక్నాలజీ ఎంత అధునాతనంగా ఉన్నప్పటికీ, దాన్ని గ్లోబల్ మార్కెట్లకు ఒక అప్లికేషన్‌గా పరిచయం చేయడంలో, ఏఐ ఆధారిత వృద్ధిలో భారతదేశం కీలక పాత్ర పోషించబోతోందని కెవిన్ అన్నారు. ముఖ్యంగా, ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ టాలెంటె వల్చర్ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.

వల్చర్ సంస్థ 2022లోనే భారత్‌లో తన క్లౌడ్ ఇన్‌ఫ్రా సేవలను ప్రారంభించింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఇప్పటికే కార్యకలాపాలు విస్తరించింది. అయినప్పటికీ, అమెరికా బయట ఇంత పెద్ద ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి చెన్నైని ఎంచుకోవడం విశేషం.

భారత్‌లో మొత్తం 1 గిగావాట్ కంప్యూటింగ్ పవర్‌ను సృష్టించాలని వల్చర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో చెన్నై ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది. భవిష్యత్తులో చెన్నై ఏఐ సూపర్ క్లస్టర్‌ను మరింత విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ఈ కొత్త డేటా సెంటర్ ప్రకటనతో పాటే, వల్చర్ మరో కీలక ఒప్పందం కూడా చేసుకుంది. తమిళనాడు ప్రభుత్వ స్టార్టప్‌ల కోసం పనిచేసే నోడల్ ఏజెన్సీ అయిన 'స్టార్టప్‌టీఎన్' (StartupTN)తో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం, తమిళనాడులోని అర్హత కలిగిన స్టార్టప్‌లకు తక్కువ ధరకే క్లౌడ్ కంప్యూటింగ్ క్రెడిట్స్‌ను అందించడానికి వల్చర్ అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+