IPO News: డల్ లిస్టింగ్ నమోదుచేసిన ఐపీవో.. బెట్ వేసిన ఇన్వెస్టర్లకు షాక్.. షేర్లు వచ్చాయా..??
Vruddhi Engineering Works: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ల క్షీణత మధ్య ఐపీవోలు లాభాలతోనే జాబితా అయిన సంగతి తెలిసిందే. అయితే మార్కెట్లోకి వచ్చిన ఈ ఐపీవో మాత్రం డల్ లిస్టింగ్‌తో ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లో విజయవంతంగా జాబితా చేయబడిన వృద్ధి ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ ఐపీవో గురించే. బీఎస్ఈ ఎస్ఎమ్ఈ ప్లాట్‌ఫారమ్‌లో నేడు షేర్లు ఒక్కోటి స్వల్పంగా 1.4 శాతం ప్రీమియంతో రూ.71 వద్ద లిస్ట్ అయ్యాయి. దీనికి ముందు ఐపీవో ఇష్యూకి సంబంధించిన ప్రైస్ బ్యాండ్ రూ.66-70గా నిర్ణయించబడింది. అయితే లిస్టింగ్ తర్వాత పుంజుకున్న ఐపీవో షేర్లు 6.5 శాతం మేర లాభపడి రూ.74.55 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

వృద్ధి ఇంజినీరింగ్ వర్క్స్ ఐపీవో 12.67 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇష్యూ రిటైల్ భాగం 20.10 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల భాగం 28.14 రెట్లు, అర్హత కలిగిన సంస్థల ఇన్వెస్టర్ల కోటా 1.05 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.4.76 కోట్లను సమీకరించింది. దీనికోసం 7.2 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఐపీవో ద్వారా పొందిన డబ్బును కంపెనీ తన వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది.
వాస్తవానికి కంపెనీ 2020లో స్థాపించబడింది. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలకు మెకానికల్ స్ప్లికింగ్ పరిష్కారాలను అందిస్తుంది. తమ ఉత్పత్తులతో వివిధ కస్టమర్ అవసరాలను తీర్చడం, reinforcement couplers అభివృద్ధి, రూపకల్పన సరఫరా ఉన్నాయి. అదనంగా కంపెనీ తన క్లయింట్‌లకు ఆన్-సైట్ థ్రెడింగ్ సేవలను అందిస్తుంది.


Click it and Unblock the Notifications