Bonus Shares: ప్రస్తుతం దేశంలో జూన్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి చాలా కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు, డివిడెండ్లను ప్రకటిస్తున్నాయి.
తాజాగా VR ఫిల్మ్స్ & స్టూడియోస్ లిమిటెడ్ తన వాటాదారులకు పెద్ద శుభవార్త ప్రకటించింది. దీంతో వారు బలమైన రాబడిని పొందబోతున్నారు. కంపెనీ త్వరలో ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందిస్తోంది. ఇటీవల మీడియా సంస్థ 7:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే ఒక్కో షేరుకు కంపెనీకి చెందిన ఏడు షేర్లు బోనస్ రూపంలో అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఉచితంగా అందిచబడతాయి.

కంపెనీ నుంచి ప్రకటన వెలువడిన నాటి నుంచి షేర్లు మార్కెట్లో నిరంతరం అప్పర్ సర్క్యూట్‌ను తాకుతూ ఉన్నాయి. జూలై 21 శుక్రవారం స్టాక్ 5% పెరిగి రూ.371.75 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో స్టాక్ 21% కంటే ఎక్కువ లాభపడి ఇన్వెస్టర్లకు డబుల్ ధమాకా రాబడులను అందించింది. దీనికి తోడు త్వరలో ఉచిత షేర్లు రావటం ఇన్వెస్టర్లను ఆనందానికి గురిచేస్తోంది.
7:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించేందుకు బోర్డు ఆమోదించిందని జూలై 15, 2023న బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE)కి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. దీనికోసం 26 జూలైని రికార్డు తేదీగా ప్రకటించింది. అంటే ఈ సమయానికి కంపెనీ రికార్డుల్లో షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే ఉచిత షేర్లు పొందేందుకు అర్హులు. అలాగే గడచిన రెండేళ్ల కాలంలో 250 శాతానికి పైగా మల్టీబ్యాగర్ రాబడులను స్టాక్ అందించింది. ఐదేళ్లలో 519.58% బలమైన రాబడిని ఇచ్చింది. ఈ సమయంలో దీని ధర రూ.60 నుంచి ప్రస్తుత స్థాయికి పెరిగింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications