Tata Voltas: ఉప్పు నుంచి విమానాల వరకు అనేక వ్యాపారాల్లో ఉన్న టాటా గ్రూప్ తాజాగా ఒక రంగం నుంచి నిష్క్రమించాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు మార్కెట్లో పెద్ద సునామీని సృష్టిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న పోటీ మార్కెట్‌లో వ్యాపారాన్ని పెంచుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున వోల్టాస్ లిమిటెడ్ కింద ఉన్న గృహోపకరణాల వ్యాపారాన్ని విక్రయించాలని టాటా గ్రూప్ పరిశీలిస్తోందని విషయం తెలిసిన వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో తన వ్యాపారాన్ని విస్తరించడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టాటా గ్రూప్ యాజమాన్యం భావిస్తోంది.

మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా టాటా గ్రూప్ మేనేజ్‌మెంట్ ఈ వ్యాపారాన్ని విక్రయించే అవకాశం గురించి చర్చించింది. అయితే జాయింట్ వెంచర్ భాగస్వామి ఆర్సెలిక్ ఏఎస్‌ను ఈ డీల్‌లో చేర్చాలా వద్దా అనేది ఇప్పటివరకు నిర్ణయించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని తెలుస్తోంది. టాటా గ్రూప్ ఈ ఆస్తిని ఎక్కువ కాలం తన వద్దే ఉంచుకోవాలని భావించవచ్చని వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై టాటా గ్రూప్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
వోల్టాస్ సంస్థ 1954లో స్థాపించబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 3.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది వోల్టాస్ కంపెనీ షేర్లు దాదాపు 3 శాతం మేర పెరిగాయి. కంపెనీ ఎయిర్ కండిషనర్లు, వాటర్ కూలర్లు, కమర్షియల్ చిల్లింగ్ యూనిట్లను తయారు చేస్తోంది. ఇండియాలోనే కాక కంపెనీ మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో కూడా తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
కంపెనీ భారతదేశంలో ఆర్సెలిక్‌తో జాయింట్ వెంచర్‌ను కలిగి ఉంది. వోల్టాస్ బెకో బ్రాండ్ పేరుతో దేశంలో అనేక గృహోపకరణాలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో వోల్టాస్ బెకో ఆదాయం దాదాపు రూ.96.7 బిలియన్లుగా ఉంది. సెప్టెంబర్ 30 నాటికి రిఫ్రిజిరేటర్ మార్కెట్‌లో టాటా వోల్టాస్ వాటా 3.3 శాతం, వాషింగ్ మెషీన్ మార్కెట్లో 5.4 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications