ఢిల్లీ: వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ భవితవ్యంపై ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వొడాపోన్ ఐడియాకు ప్రభుత్వం ఊరట కల్పించకుంటే సంస్థను మూసివేయక తప్పదన్నారు. రెండ్రోజుల క్రితం హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వానికి రూ.53,038 కోట్ల పాతబకాయిలు చెల్లించాల్సి ఉన్న వొడాఫోన్ ఐడియాకు ఉపశమనం లభించని పక్షంలో ఈ సంస్థ భవితవ్యం ఏమిటనే ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ... ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి చేయూత లేకుంటే వొడాఫోన్ ఐడియా కథ ముగిసిట్టే భావిస్తానన్నారు.

మందగమనం నేపథ్యంలో ప్రభుత్వం వివిధ రంగాలకు ఉపశమనం కల్పిస్తోందని, టెలికం రంగం కూడా ఎంతో కీలకమైందనే వాస్తవం ప్రభుత్వానికి బోధపడిందని, కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా టెలికం రంగంపైనే ఆధారపడి ఉందని, ప్రభుత్వం నుంచి మరిన్ని ఉద్ధీపనలు అవసరమన్నారు.
ఉచిత వాయిస్ కాల్స్, అతితక్కువ ధరకు డాటాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ముఖేశ్ అంబానీకి చెందిన జియో దేశీయ టెలికం మార్కెట్లో మొదలుపెట్టిన యుద్ధాన్ని తట్టుకునేందుకు బిర్లా నేతృత్వంలోని ఐడియా సెల్యులార్ గత ఏడాది వొడాఫోన్ ఇండియా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీతో కలిసి వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడింది. ఈ విలీన సంస్థ రుణభారం రూ.1.17 లక్షలకోట్లకు పెరిగింది. పైగా దేశంలోని టెలికం సంస్థల నుంచి పాతబకాయిలను వసూలు చేయాలన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌కు శరాఘాతమైంది.
ఈ తీర్పుతో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, ఇతర టెలికం సంస్థలు గత పద్నాలుగేళ్ళకు సంబంధించిన లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినిమయ చార్జీలు, వాటిపై వడ్డీ, జరిమానా కలిపి ప్రభుత్వానికి దాదాపు రూ.1.47 లక్షల కోట్ల పాత బకాయిలు చెల్లించాల్సి వస్తోంది. దీనిని అధిగమించేందుకు వడ్డీని, జరిమానాను రద్దు చేయడం ద్వారా తమ బకాయిలను సగానికి తగ్గించాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అలాగే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలుచేశాయి.
ఇదిలా ఉండగా, AGRపై సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరణకు గురైతే ఎయిర్ టెల్ కంటే వొడాపోన్ ఐడియాకే ఎక్కువ దెబ్బ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వొడాఫోన్ ఐడియా ఇప్పటికే భారీ నష్టాల్లో ఉండటంతో రివ్యూ పిటిషన్ కొట్టివేత ఆ సంస్థకు ఇబ్బందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications