టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) వాయిస్ కాల్స్ డేటాను మై-కాల్ పోర్టల్ ద్వారా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం దేశీయ మూడో వైర్లెస్ టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా(VI) వాయిస్ కాల్ రేటింగ్ పోటీ సంస్థల కంటే క్వాలిటీగా ఉంది. డిసెంబర్ నెలలో ఇది టాప్‌లో ఉంది. సగటు వాయిస్ కాల్ రేటింగ్ 4.9గా ఉంది. ట్రాయ్ మైకాల్ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు సమర్పించిన డేటా ఆధారంగా ఈ సమాచారం సేకరించినట్లు తెలిపింది.
1 నుండి 5 వరకు వాయిస్ క్వాలిటీ రేటింగ్ ఇచ్చారు. 2020 చివరి నెల ఇండోర్, ఔట్ డోర్ వాయిస్ కాల్ క్వాలిటీని పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో వొడాఫోన్ ఐడియా ఔట్ డోర్, ఇండోర్ సగటు వాయిస్ క్వాలిటీలో 4.9 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. కాల్ నాణ్యత ఎక్స్పీరియన్స్ పరంగా 97.59 శాతం సంతృప్తికర రేటింగ్ ఇచ్చారు. ఇక, ఇండోర్ వాయిస్ కాల్ క్వాలిటీ రేటింగ్ 4.4తో 87.68 శాతం సంతృప్తికర రేటింగ్ పొందింది. ఔట్ డోర్ వాయిస్ కాల్ క్వాలిటీ రేటింగ్ 3.6గా ఉంది. నవంబర్ నెలలో సగటున 4.6గా నమోదయింది.

బీఎస్ఎన్ఎల్ రేటింగ్ నవంబర్ నెలతో పోలిస్తే మాత్రం డిసెంబర్లో స్వల్పంగా పడిపోయింది. వాయిస్ కాల్ క్వాలిటీ రేటింగ్ 3.9గా ఉంది. నవంబర్ నెలలో ఇది 4.1గా ఉంది. డిసెంబర్ నెలలో బీఎస్ఎన్ఎల్ సంతృప్తికర రేటింగ్ 76.58 శాతం.
ఇక, దేశీయ అతిపెద్ద టెల్కో రిలయన్స్ జియో వాయిస్ క్వాలిటీ రేటింగ్ డిసెంబర్ నెలలో పెరిగింది. సగటు రేటింగ్ 3.9, సంతృప్తికర రేటింగ్ 77.81 శాతం. రెండో అతిపెద్ద టెల్కో ఎయిర్ టెల్ వాయిస్ క్వాలిటీ రేటింగ్ 3.1గా ఉంది. నవంబర్ నెలలో ఇది 3.8గా ఉంది. దీంతో పోలిస్తే డిసెంబర్ నెలలో తగ్గింది. ఎయిర్టెల్ సంతృప్తికర రేటింగ్ 75.21 శాతం నుండి డిసెంబర్ నెలలో 59.46 శాతానికి పడిపోయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications