For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3జీ యూజర్లకు వొడాఫోన్ ఐడియా గుడ్‌న్యూస్

|

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ 4G సేవల్లో దూసుకెళ్తున్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 3G సేవలు పొందుతున్న యూజర్లను 4Gకి అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. 2జీ, 3జీ కస్టమర్లను 4జీకి అప్ గ్రేడ్ చేసే సమయం ఆసన్నమైందని, అయితే 2జీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా 3జీ యూజర్లను దశలవారగా వీఐ గిగా నెట్ టెక్నాలజీ ద్వారా 4జీకి అప్ గ్రేడ్ చేసి, వేగవంతమైన డేటా అందిస్తామని తెలిపింది. ప్రధాన సర్కిల్స్‌లో అప్ గ్రేడింగ్ ప్రక్రియను ప్రారంభించింది.

వీఐ ఇటీవల క్రమంగా కోలుకుంటోంది. దీంతో తన నెట్ వర్క్‌ను ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగా 3జీ డేటా సేవల విని యోగదారుల్ని 4జీ సేవల స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తోంది. వీరిని దశలవారీగా 4జీ సేవల స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తుంది. 2జీ నెట్‌వర్క్‌ను 4జీకి అప్‌గ్రేడ్‌ చేసే స్థాయిలో ఉన్నప్పటికీ వాయిస్ సేవలు మాత్రమే అందుకుంటున్న కస్టమర్ల కోసం ఆ నెట్‌వర్క్‌ను కొనసాగించనున్నట్లు తెలిపింది.

Vodafone Idea to upgrade 3G users to 4G in phased manner

ఒక్క జూన్ నెలలో 48 లక్షలమంది సబ్‌స్కైబర్లను కోల్పోయింది వొడాఫోన్ ఐడియా. ఇతర కంపెనీలకు పోటీగా నిలిచేందుకు ముఖ్యంగా పదహారు సర్కిల్స్ పైన దృష్టి సారిస్తుంది. ఆయా మార్కెట్లలో సబ్‌స్క్రైబర్లను, మార్కెట్ వాటాను పెంచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 4జీ సేవలను అప్ గ్రేడ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది.

English summary

3జీ యూజర్లకు వొడాఫోన్ ఐడియా గుడ్‌న్యూస్ | Vodafone Idea to upgrade 3G users to 4G in phased manner

Further, the company said it is in the best position to upgrade 2G customers also to 4G, but it will continue with basic voice based services to its 2G subscribers.
Story first published: Monday, September 28, 2020, 21:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X