Vodafone Idea Stock: చిన్న షేర్లకు గ్యాలం వేసి పెద్ద రాబడులను అందుకోవాలని చాలా మంది పెట్టుబడులు భావిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో వారి రాడార్ లో ఎల్లప్పుడూ ఉంటే షేర్లలో ఒకటి వొడఫోన్ ఐడియా. టెలికాం రంగంలోని ఈ కంపెనీ వాస్తవానికి జియో ఎంట్రీ తర్వాత మనుగడను కొనసాగించటానికి కూడా ఇబ్బంది పడుతోంది. పైగా భారీ అప్పుల్లో కూరుకుపోయిన సంస్థ తిరిగి మార్కెట్ లీడర్ కావటానికి ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే నేడు కంపెనీలో ఈజీఎం జరగనుంది. 2025 ప్రారంభమైన తర్వాత కంపెనీ సీఈవో అక్షయ ముంద్రా స్టేక్ హోల్డర్లకు కంపెనీ గత ఏడాది సాధించిన విజయాలపై తాజాగా మెయిల్ పంపారు. గడచిన ఏడాదిలో 46,000 కొత్త సైట్లలో తమ నెట్ వర్క్ కవరేజీని పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. గతంలో ఎన్నడూ చూడని వేగంతో దీనిని పూర్తి చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇండోర్ కవరేజీపై కంపెనీ ఫోకస్ పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది.

వొడఫోన్ ఐడియా దేశంలో బలమైన, అత్యుత్తమ 4జీ కవరేజీని అందిస్తోందని కంపెనీ పేర్కొంది. ఓపెన్ సిగ్నల్ సంస్థ అందించిన నివేదిక ప్రకారం 4జీ డౌన్‌లోడ్, అప్‌లోడ్ లలో కంపెనీ అత్యుత్తమ పనితీరుతో ముందు వరుసలో నిలిచింది. అలాగే 5జీని దశలవారీగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు ప్రకటించారు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడేలో దాదాపు 3 శాతం పెరిగి రూ.8.10 స్థాయికి చేరింది. అలాగే కంపెనీ నేడు పెట్టుబడిదారులకు కొత్తగా 1.75 కోట్ల షేర్లను విక్రయించాలని చూస్తున్నట్లు వెల్లడైంది.
తాజాగా కంపెనీ ఈక్విటీ షేర్లను జారీ చేయటం ద్వారా రూ.1980 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఈ షేర్లను ఒమేగా టెలికాం హోల్డింగ్స్, ఉషా మార్టీన్ టెలిమ్యాటిక్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటికి ఇప్పటికే కంపెనీలు అర శాతానికి కంటే తక్కువ వాటాలు ఉన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా వచ్చే సొమ్మును కంపెనీ ఇండస్ టవర్స్ సంస్థకు చెల్లింపులు చేసేందుకు వినియోగించాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. అలాగే టెలికాం రెగ్యులేటర్ డాట్ స్పెక్ట్రమ్ కొనుగోళ్లకు బ్యాంక్ గ్యారెంటీలు అక్కర్లేదని చెప్పటం కంపెనీకి కొలిసొచ్చింది.
అలాగే కంపెనీ షేర్లు ఇటీవలి కాలంలో బుల్ జోరును చూడటానికి మరో కారణం వొడఫోన్ సంస్థ విఐ షేర్ల తాకట్టు నుంచి విడిపించటానికి రూ.11,600 కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెంట్రమ్ బ్రోకింగ్ కంపెనీపై స్పందిస్తూ డిసెంబరు నాటికి 40 లక్షల యూజర్లు తగ్గారని, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ రూ.164 వద్ద ఉందని పేర్కొంది. అలాగే డిసెంబర్ త్రైమాసికానికి కంపెనీ నికర నష్టాన్ని రూ.7,129 కోట్లుగా నివేదించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే క్వార్టర్లో కంపెనీ ాదాయం రూ.11,206 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.


Click it and Unblock the Notifications