మెగా ర్యాలీలో Vodafone Idea షేర్లు.. రిలయన్స్ జియోకి చుక్కలు చూపించే ప్లాన్ ఇది..!!
Vodafone Idea Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో వొడఫోన్ ఐడియా షేర్లు మెగా ర్యాలీతో దూసుకుపోతున్నాయి. వాస్తవానికి గడచిన వారం సుప్రీం కోర్టులు వచ్చిన తీర్పుతో పెద్ద కుదుపుకు లోనైన టెలికాం దిగ్గజం నేడు భారీగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే దీనివెలున రెండు కీలక కారణాలు ఉన్నాయి.
సోమవారం మార్కెట్ల ప్రారంభంతం తర్వాత వొడఫోన్ ఐడియా కంపెనీ షేర్ల ధర ఒక్కసారిగా ఇంట్రాడేలో 11 శాతం మేర లాభపడింది. దీనివెనుక ఉన్న ముఖ్యమైన కారణం పరిశీలిస్తే టెలికాం దిగ్గజం రూ.30,000 కోట్ల విలువైన మెగా డీల్ చేసుకోవటమే. అవును ప్రైవేట్ టెలికాం సంస్థ నోకియా, ఎరిక్సన్, సామ్‌సంగ్ కంపెనీలతో ఈ మేరకు నెట్‌వర్క్ ఎక్విప్మెంట్ సప్లై కోసం రానున్న మూడేళ్ల కోసం ఈ డీల్ కుదుర్చుకుంది. దీంతో నేడు ఉదయం మార్కెట్ల ప్రారంభంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.11.63 వద్ద ఉంది. ఇప్పటికే టెలికాం రంగంలో సవాలు విసురుతున్న జియోతో పోటీ పడేందుకు కంపెనీకి ఈ డీల్ అత్యంత ముఖ్యమైనదిగా తెలుస్తోంది.

కంపెనీ తన వ్యాపార పరివర్తన కోసం నిర్ణయించిన 6.6 బిలియన్ డాలర్ల మూడేళ్ల క్యాపెక్స్ ప్లాన్ లో ఇది మెుదటి అడుగుగా తెలుస్తోంది. టెలికాం దిగ్గజం దేశంలోని తన 4జీ కవరేజీని ప్రస్తుత 1.03 బిలియన్ల నుంచి 1.2 బిలియన్లకు విస్తరించే దిశగా నిర్దేశించబడింది. అలాగే కంపెనీ తన 5G నెట్‌వర్క్‌ను కీలకంగా ప్రారంభించింది. విస్తరిస్తున్న భారతీయ మార్కెట్లు, డేటా వృద్ధికి అనుగుణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కంపెనీ దాని ప్రస్తుత దీర్ఘకాలిక భాగస్వాములైన నోకియా, ఎరిక్సన్‌లతో కొనసాగుతోంది. అలాగే కొత్త భాగస్వామిగా శామ్‌సంగ్‌ను సైతం జోడించింది.
జూన్ 2024లో కంపెనీ కొత్త క్యాపిటల్ రైజ్ చేయటం, అదనపు స్పెక్ట్రమ్ కొనుగోలు వంటి కీలక చర్యలు వొడఫోన్ ఐడియా భవిష్యత్తుపై మార్కెట్లోని ఇన్వెస్టర్లు సైతం కంపెనీ షేర్లపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. వాస్తవానికి గతవారం కంపెనీ షేర్లు భారీగా అమ్మకాలకు గురికావటంతో పతనాన్ని చూశాయి. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిల రీకాలిక్యులేషన్‌పై టెలికాం కంపెనీల పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు నిర్ణయం ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడికి కారణంగా నిలిచింది. దీంతో 2024లో ఇప్పటి వరకు కంపెనీ షేర్లు దాదాపు 32 శాతం పతనాన్ని చూశాయి. అయితే నేడు బోర్డు కీలక మీటింగ్ జరగనుండటంపై కూడా ఇన్వెస్టర్లు కన్నేసి ఉంచారు.
బ్రోకరేజీల అభిప్రాయం..
టెలికాం దిగ్గజానికి ప్రభుత్వ మద్దతు ఉందని బ్రోకరేజ్ సంస్థ తన నోట్స్‌లో పేర్కొంది. వొడాఫోన్ ఐడియా తన బ్యాడ్ ఫేజ్‌ను వదిలిపెట్టిందని బ్రోకరేజ్ హౌస్ అభిప్రాయపడింది. మీడియం నుంచి లాంగ్ టర్మ్‌లో రూ.15 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ వెల్లడించింది. ఈ బ్రోకరేజ్ నోమురా ఇండియా గతంలో కంపెనీ షేర్లకు అందించిన 'న్యూట్రల్' రేటింగ్‌కి వ్యతిరేకంగా స్టాక్‌పై 'BUY' రేటింగ్ అందించింది. రానున్న కాలంలో కంపెనీ షేర్ల ధరలు రూ.15 స్థాయికి చేరుకోవచ్చని టార్గెట్ ధరను ప్రకటించింది.


Click it and Unblock the Notifications